»   »  కమల్ మాటల్లోనే... ‌: తెలుగులో స్ట్రైయిట్ చిత్రం 24 నుంచి (వీడియో)

కమల్ మాటల్లోనే... ‌: తెలుగులో స్ట్రైయిట్ చిత్రం 24 నుంచి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఇటీవల 'ఉత్తమ విలన్‌' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కమల్‌హసన్‌ తాను చేయబోయే తదుపరి చిత్రం గురించి వివరాలను ఆదివారం వెల్లడించారు. 'తూంగవనం' (తెలుగులో నిద్రపోని అడవి) పేరుతో తెలుగు, తమిళ భాషాల్లో ఓ థ్రిల్లర్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ సినిమా ప్రకటన విభిన్నంగా వీడియో రూపంలో విడుదలచేసాడు. ఈ క్రింద వీడియోలో తదుపరి తాను నటించనున్న ద్విభాషా చిత్ర వివరాలు తెలుపడం విశేషం. మీరూ ఈ వీడియోని వీక్షించండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మే 24న హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభిస్తామని కమల్‌ వెల్లడించారు. గతంలో కమల్‌ దగ్గర సహాయకుడిగా పనిచేసిన ఎం.రాజేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని కమల్‌ హసన్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి ...వెంకటేష్‌తో కలసి నటించిన 'ఈనాడు' తర్వాత కమల్‌ హాసన్‌ తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. ఆయన తమిళంలో నటించిన చిత్రాలే తెలుగులో అనువాదమవుతూ వస్తున్నాయి. త్వరలోనే మరో తెలుగు సినిమా చేస్తా అని చెబుతూ వస్తున్నారు కమల్‌.

ఆ మాట త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఈ నెల 24న హైదరాబాద్‌లో కమల్‌హాసన్‌ కొత్త సినిమా మొదలుకానుంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించటంతో అభిమానులంతా ఆనందంగా ఉన్నారు.

Kamal Haasan’s next is bilingual thriller ‘Thoongavanam’

తన దగ్గర శిష్యరికం చేసిన రాజేష్‌.ఎమ్‌.సెల్వ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు కమల్‌. తెలుగు, తమిళ భాషల్లో కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌లో ఒకేసారి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తమిళంలో 'తూంగావనం' అనే పేరును ఖరారు చేశారు.

థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాని 40 రోజులు హైదరాబాద్‌లో, 40 రోజులు చెన్నైలో చిత్రీకరిస్తామని కమల్‌ స్పష్టం చేశారు. ఇతర నటీనటులెవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాను వర్గీస్‌, సంగీతం: జిబ్రాన్‌

జెట్ స్పీడుతో యాభై పై బడిన వయస్సులోనూ కమల్ పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమల్‌హాసన్‌ నటించిన మూడు సినిమాలు 2015లో విడుదల అవుతున్నాయి. ‘ఉత్తమ విలన్‌'(ఇప్పటికే రిలీజైంది), ‘విశ్వరూపం-2', ‘పాపనాశం'... (దృశ్యం రీమేక్) ఈ మూడు సినిమాలూ ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా కమల్‌ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కానుండటం గమనార్హం.

మరో విశేషమేమిటంటే... ఈ మూడు చిత్రాలకు గిబ్రన్‌ (రన్ రాజా రన్ చిత్రం సంగీత దర్శకుడు) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘విశ్వరూపం-2' సినిమా, మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం' రీమేక్‌ ‘పాపనాశం' ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి.

‘పాపనాశం' కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్‌ భార్యగా నటిస్తున్న చిత్రమిది.

దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Actor Kamal Haasan on Sunday announced that his next project, a bilingual thriller Thoongavanam (‘the jungle that never sleeps’), will to be produced by his Rajkamal Films and directed by his former assistant M. Rajesh. “We have a happy news to share with you. Rajkamal Films’ next will be double version in Tamil and Telugu. We are going to inaugurate the shooting of this dual version in Hyderabad on May 24,” Haasan, 60, said in a video message.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu