»   » ఆర్థిక ఇబ్బందుల్లో కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’

ఆర్థిక ఇబ్బందుల్లో కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్ తాజా చిత్రం ‘ఉత్తమ విలన్' చిత్రాన్ని మే 1న తెలుగు, తమిళంలో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం వల్ల సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయడం కష్టమే అంటున్నారు. ఇప్పటికే సినిమాను పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవ్వటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏప్రిల్ చివరి వారంలోగా నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడితే తప్ప సినిమా విడుదలయ్యే పరిస్థితి కనబడటం లేదని టాక్. ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్ విడుదల చేయబోతున్నారు.

సినిమా వివరాల్లోకి వెళితే... కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘ఉత్తమవిలన్‌'. ఎన్‌.లింగుస్వామి, కమల్‌హాసన్‌ నిర్మాతలు. ఆండ్రియా జెరీమియా, పూజా కుమార్‌, పార్వతి, జయరామ్‌, పార్వతి నాయర్‌ కీలక పాత్రధారులు. తిరుపతి బ్రదర్స్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.


kamal hassan

చిత్ర దర్శకుడు రమేష్‌ అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో కమల్‌హాసన్‌గారు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌ (ప్రత్యేకమైన మేకప్‌తో కేరళలో ప్రదర్శించే పురాతన కళ)గా, సినిమా ఆర్టిస్ట్‌గా రెండు పాత్రల్లోనూ మెప్పిస్తారు. తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి ఆయన ఎక్కువగా శ్రమించారు. ఆ పాత్రకు మేకప్‌ వేసుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది. కె.బాలచందర్‌, కె.విశ్వనాథన్‌ ఇందులో కీలక పాత్రలను పోషించారు. వాళ్లను దర్శకత్వం వహిస్తూ చాలా విషయాలను నేర్చుకున్నాను'' అని తెలిపారు.


ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

English summary
After Ganga and Lion, it is Uttama Villain's turn to face its share of debacles. In fact, the film has already suffered a great loss because of an unwanted controversy in Tamilnadu. After beating out the odds, Kamal Haasan's Uttama Villain was announced to hit screen on 1 May in Both Tamil and Telugu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu