»   » కమల్ హాసన్‌పై...మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!

కమల్ హాసన్‌పై...మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు ఇప్పటికే రెండు వివాహాలు....రెండు సార్లు విడాకులైన సంగతి తెలిసిందే. తొలుత శాస్త్రీయ నృత్య కళాకారిని వాణి గణపతిని పెళ్లాడిన ఆయన పదేళ్ల కాపురం తర్వాత ఆమెతో విడిపోయారు. తర్వాత సారికను పెళ్లాడిన ఆయన ఇద్దరు పిల్లలు శృతి హాసన్, అక్షర హాసన్ లకు తండ్రయ్యారు. సారిక, కమల్ హాసన్ 2004లో విడిపోయారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటి గౌతమితో సహ జీవవనం చేస్తున్నారు.

Kamal Haasan's Vani Ganapathy Hits Back At Alimony Claims

కాగా... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ విడాకుల కారణంగా తాను దివాలా తీసినట్లు పేర్కొన్నాడు. కమల్ వ్యాఖ్యలపై ఆయన మొదటి భార్య వాణి గణపతి తీవ్రంగా స్పందించారు. తనకు విడాకులు ఇచ్చిన తర్వాత అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చిందని కమల్ హాసన్ పేర్కొనడంపై ఆమె ఫైర్ అయ్యారు.

తనతో పెళ్లయిన సమయంలో కమల్ హాసన్‌కు అసలు ఇల్లే లేదని, అపుడు మేము అద్దె ఇంట్లోనే ఉండే వాళ్లం అంటూ ఆమె స్పష్టం చేసారు. ఏదైనా తప్పు జరిగితే ఇతరుల మీదకు మోపేయడం ఆయనకు అలవాటనీ, అతను దివాళా తీయడానికి విడాకులు కాకుండా వేరే కారణాలు ఉండి ఉంటాయని ఆమె ఘాటుగా స్పందించారు. తనకు ఆయన నుండి భారీ ఎత్తున మనోవర్తి దక్కిఉంటే బెంగుళూరులో లగ్జరీ ఏరియాలో విలాసవంతమైన ఇంట్లో ఉండేదాన్ని అని ఆమె పేర్కొన్నారు. చాలా ఏళ్ల నుండి తాను కమల్ హాసన్ తో అలసు మాట్లాడ లేదని, ఇపుడు ఆయన ఇలా తన వ్యక్తిగత విషయాల్లోని నా పేరు లాగడంతో షాకయ్యానని వాణి గణపతి పేర్కొన్నారు.

English summary
Kamal Haasan's Vani Ganapathy Hits Back At Alimony Claims. Vani said that Kamal never owned a flat during their marriage that lasted from 1978-1988 and him moving into a rented house after divorce has no truth to it.
Please Wait while comments are loading...