బ్రేకింగ్: విశ్వరూపం2 సినిమా విడుదల వాయిదా.. కారణం అదే..
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం2 చిత్రం వాయిదా పడింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. కరుణానిధి మరణం నేపథ్యంలో రెండు రోజులపాటు సంతాప దినాలను రాష్ట్రం పాటిస్తున్న క్రమంలో విశ్వరూపం2 చిత్రం ప్రీమియర్లను కూడా వాయిదా వేశారు.
వాస్తవానికి విశ్వరూపం2 చిత్రాన్ని ఆగస్టు 10న ప్రపంచవవ్యాప్తంగా విడుదల చేయాలనుకొన్నారు. రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా కరుణానిధి మృతి చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే.

కరుణ విషాద సంఘటన నుంచి తమిళ ప్రజలు తేరుకొన్న తర్వాత ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే విశ్వరూపం2 సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అడ్వాన్సుగా టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు వెనుకకు తిరిగి ఇస్తామని చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది.


Click it and Unblock the Notifications











