లీగల్ సమస్యల్లోనే విశ్వరూపం 2.. ఓపిక పట్టండి.. కమల్
విశ్వరూపం 2 చిత్రం విడుదలకు అన్ని అడ్డంకులు తొలగుతున్నాయని, మరో ఆరు నెలలు ఓపిక పట్టండని విలక్షణ నటుడు కమల్ హాసన్ తెలిపారు.
విశ్వరూపం 2 చిత్రం విడుదలకు అన్ని అడ్డంకులు తొలగుతున్నాయని విలక్షణ నటుడు కమల్ హాసన్ తెలిపారు. 2013లో విడుదలైన స్పై థ్రిల్లర్ విశ్వరూపం చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. శుక్రవారం కమల్ చేసిన ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

విశ్వరూపం 2 విడుదల కోసం అన్ని అడ్డంకులు తొలగనున్నాయి. ఈ చిత్రానికి ఎదురైన అడ్డంకులను తొలగించడానికి తాను వ్యక్తిగతం కృషిచేస్తున్నాను. ఇంకా కొన్ని లీగల్, టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. మరో ఆరునెలలు ఆగండి అంటూ ట్వీట్ చేశారు.
విశ్వరూపం 2 చిత్రానికి కథ, మాటలు అందించడంతోపాటు స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజకుమార్; అండ్రియా, శేఖర్ కపూర్, రాహుల్ బోస్ తదితరులు నటిస్తున్నారు.
More from Filmibeat
kamal haasan vishwaroopam 2 pooja kumar andrea shekhar kapur and rahul bose కమల్ హాసన్ విశ్వరూపం 2 పూజకుమార్ అండ్రియా శేఖర్ కపూర్ రాహుల్ బోస్


Click it and Unblock the Notifications











