»   » కూతురుకు గుండు గీసిన కమల్.. ఇంతకీ ఏం జరిగింది..

కూతురుకు గుండు గీసిన కమల్.. ఇంతకీ ఏం జరిగింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రయోగాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ప్రయోగాలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ప్రస్తుతం కమల్ బాటలోనే ఆయన కూతురు అక్షరహాసన్ సిద్ధమవుతున్నది. సినిమాలలో పాత్రల కోసం సాధారణంగా అమ్మాయిలు గుండు చేయించుకోవడం అరుదు. అలాంటి పాత్ర కోసం గుండు గీయించుకోవడానికి నేను రెడీ అని ఇటీవల ఆమె ప్రకటించారు.

గుండు పాత్ర కోసం ఎదురు చూస్తున్నా

గుండు పాత్ర కోసం ఎదురు చూస్తున్నా

‘గుండుతో నటించే పాత్రల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పటివరకూ అలాంటి పాత్రలు తారసపడలేదు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. పాత్ర కోసం జుట్టును త్యాగం చేసేస్తా' అని అన్నారు. ‘గుండు గీయించుకోవడానికి నేను రెడీ! మరి, దర్శక-నిర్మాతలు రెడీనా? నన్ను గుండుతో చూపిస్తారా?'' అని నిర్మాతలకు సంకేతమిచ్చారు.

నాన్న స్వయంగా గుండు గీసారు..

నాన్న స్వయంగా గుండు గీసారు..

గతంలో ఓసారి గుండు చేయించుకున్నానని అక్షర హాసన్ గుర్తు చేసుకొన్నారు. స్వయంగా తనకు గుండు గీసింది తండ్రి కమల్‌హాసన్ అని చెప్పారు.

సరదాగా గుండు గీసుకుంటే ఎలా..

సరదాగా గుండు గీసుకుంటే ఎలా..

‘చిన్నప్పుడు నా హెయిర్‌ షార్ట్‌గా ఉండేది. ఓసారి సరదాగా ‘గుండు చేయించుకుంటే ఎలా ఉంటుంది?' నాన్నతో అన్నాను. వెంటనే బాత్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి స్వయంగా ఆయనే గుండు గీశారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. అప్పుడప్పుడూ మేం ఇలాంటి క్రేజీ థింగ్స్‌ చేస్తుంటాం' అక్షర అన్నారు.

షమితాబ్‌తో తొలిసారి సినిమాల్లోకి

షమితాబ్‌తో తొలిసారి సినిమాల్లోకి

కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన అక్షరహాసన్ తొలిసారి షమితాబ్ అనే హిందీ చిత్రంలో అమితాబ్, ధనుష్‌తో కలిసి నటించారు. ప్రస్తుతం అజిత్‌తో వివేకం, హిందీలో లాలీకి షాదీ మే లడ్బూ దీవానా చిత్రాల్లో నటిస్తున్నారు. చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్నాయి. అంతేకాకుండా కమల్‌హసన్ నిర్మిస్తున్న శభాష్‌నాయుడు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

English summary
Kamal Haasan known for experimenting different roles in film industry. Now his daughter is getting ready to take up experiments in her carrer. Akshara said she is ready to get shaved her head.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu