For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మన విలన్ హాలీవుడ్ లో హీరో అయ్యాడు : ఆ సినిమాకి ఇన్స్పిరేషన్ కమల్ సినిమానే ?

  |

  రెండేళ్ల కింద‌ట క‌మ‌ల్ హాస‌న్ నుంచి వ‌చ్చిన ఈ చిత్రం విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లందుకుంది. "ఉత్తమ విలన్' చిత్రం రిలీజ్ అవ్వడమే వివాదాలతో రిలీజైంది.సినిమా కథ బావుందని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. మరో వైపు కమల్ హాసన్, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఎవరు ఎవరో తెలుసుకోవడమే జీవితం. పరిస్థితులే ఎవరు విలనో, ఎవరు హీరోనో నిర్ణయిస్తాయి. నీ దృష్టిలో నేనేంటి అనేది అనవసరం. నా దృష్టిలో నేనేంటి అనేదే ముఖ్యం. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకొని ఎలా ఉత్తముడిగా నిలవాలన్నదే ఈ కథ. అంటూ కమల్ చెప్పిన మాటలు సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉందో చెప్పాయి. అయినా కమర్షియల్ గా అనుకున్నంత సక్సెస్ అవలేదు....

  హాలీవుడ్ రేంజ్ లో

  హాలీవుడ్ రేంజ్ లో

  అయితే రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. అదీ మాములుగా కాదు హాలీవుడ్ రేంజ్ లో.. ఇంతకీ అసలేం జరిగింది? ఉత్తమ విలన్ అక్కడ "హీరో" ఎలా అయ్యాడు? అన్నవి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జులై 9న విడుద‌ల కాబోతున్న హాలీవుడ్ మూవీ "హీరో" ఉత్త‌మ విల‌న్ ఆధారంగానే తెర‌కెక్కిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

  గర్వించదగ్గ విషయమే.

  గర్వించదగ్గ విషయమే.

  ఈ సినిమాకు సంబంధించిన వికీపీడియా పేజీలో ర‌చ‌న క్రెడిట్ క‌మ‌ల్ తో పాటు ఇంకో ఇద్ద‌రికి ఇవ్వ‌డం విశేషం. హీరో మూవీకి ఇప్ప‌టికే కొన్ని చోట్ల ప్రిమియ‌ర్లు కూడా వేశారు. వాటికి మంచి స్పంద‌న వ‌స్తోంది. క‌మ‌ల్ ‘ఉత్త‌మ విల‌న్' ఆధారంగానే ఈ "హీరో" తెర‌కెక్కింద‌ని.. అందుకే ఆయ‌న‌కు రైటింగ్ క్రెడిట్ ఇచ్చార‌ని అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా మన వాళ్ళు గర్వించదగ్గ విషయమే.

  కమల్ మీద ఉన్న అభిమానం

  కమల్ మీద ఉన్న అభిమానం

  కథగానూ, కమల్ నటనలోనూ ఎక్కడా వంకపెట్టలేని ఈ చిత్రం కేవలం ఆ కథను నడిపించే కథనంలోనే తడబడి...చూసే వారిని ఓ రేంజిలో విసిగించింది. అప్పటికీ చివరి వరకూ ఈ చిత్రాన్ని భరించగలిగాం అంటే అది కమల్ మీద ఉన్న అభిమానం. ఈ సినిమాలో ఆయన చేసిన నట విన్యాసాలు. అయితే బంగారు కంచానికైనా గోడ చేరువ కావాలన్నట్లు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కలిసిరాక మిగతావేమీ ఎలివేట్ కాలేదు. కానీ హాలివుడ్ నిర్మాతలను మాత్రం ఆకర్షించింది.

  ప్రేమించిన యామినిని కాదని

  ప్రేమించిన యామినిని కాదని

  మనోరంజన్(కమల్ హాసన్) ఓ పెద్ద స్టార్. అతని కెరీర్ వెనక...మార్గదర్శి (కె.బాలచందర్), తనని స్టార్ ని చేసిన నిర్మాత పూర్ణ చంద్రరావు(కె విశ్వనాధ్) ఉంటారు. మనోరంజన్...ఓ దశలో తను ప్రేమించిన యామినిని కాదని, పూర్ణ చంద్రరావు కుమార్తె వరలక్ష్మి(ఊర్వశి)ని వివాహం చేసుకుంటాడు.

  బ్రెయిన్ ట్యూమర్

  బ్రెయిన్ ట్యూమర్

  జీవితం పూలవానలా సాగిపోతున్న సమయంలో ఊహించని విధంగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ అనే విషయం బయిటపడుతుంది. ఎంతో కాలం బ్రతకలేనని తెలుసుకున్న మనోరంజన్..చివరగా తన మార్గదర్శి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని కోరుకుంటాడు.

  తెయ్యమ్ కళ నేపధ్యంలో

  తెయ్యమ్ కళ నేపధ్యంలో

  ఆ ఆఖరి చిత్రం చూసినవారు సంతోషంగా బయిటకువెళ్లాలని అడుగుతాడు. అలా తెయ్యమ్ కళ నేపధ్యంలో మృత్యుంజయుడిగా మారిన ఉత్తముడు కథ తెరకెక్కించాలని నిర్ణయించుకుంటారు. సినిమాలో సినిమా మొదలవుతుంది. మరణానికి దగ్గరవుతున్న మనోరంజన్...మృత్యుంజయుడి కథని ఎలా పూర్తి చేసాడు. ఆ క్రమంలో ఎదురైన సవాళ్లు ..అనుభవాలు ఏమిటి.. అన్న కథాంసం ఇప్పుడు హాలీవుడ్ లో "హీరో" గా వస్తోంది.

  English summary
  'The Hero' directed by Brett Haley, has Sam Elliot reprising both the roles played by Kamal Haasan with necessary changes to suit the western aesthetics. Kamal has been credited as one of the screenwriters and the film is touted as the best in the career of 'Jurassic Park' star Sam Elliot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X