twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikram pre release review.. కమల్, సూర్య, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోను ఆసక్తిగా భారతీయ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా అనేక అంశాలు, విశేషాలు, మల్టీస్టారర్ చిత్రంగా రూపొందడంతో విక్రమ్‌ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

    Recommended Video

    Vikram Hit List Movie Public Talk #VOX | Filmibeat Telugu
    మల్టీ స్టారర్ మూవీగా

    మల్టీ స్టారర్ మూవీగా

    విక్రమ్ సినిమా విషయానికి వస్తే.. కమల్ హాసన్‌తోపాటు పలువురు స్టార్ హీరోలు భాగమయ్యారు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య లాంటి అగ్రహీరోలతోపాటు నరైన్, హరీష్ ఉత్తమన్ తదితరులు నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్లు నటించారు.

    విక్రమ్ సినిమా నిడివి ఎంతంటే?

    విక్రమ్ సినిమా నిడివి ఎంతంటే?

    విక్రమ్ సినిమా నిడివి 2 గంటల 53 నిమిషాలు. మొదటి భాగం 1.30 గంటలు కాగా, రెండో భాగం 1.23 గంటలు అని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. దక్షిణాది భాషల్లోనే కాకుండా సింగపూర్, మలేషియా, గల్ఫ్, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో భారీ స్పందన కనిపిస్తున్నది.

    గుడి కంటే థియేటర్ గొప్ప చోటు

    గుడి కంటే థియేటర్ గొప్ప చోటు

    కమల్ హాసన్ మాట్లాడుతూ.. థియేటర్ అనేది గుడి కంటే గొప్ప చోటని భావిస్తా. పక్కనున్నవాడు ఏ జాతి,మతం అనే పట్టింపు ఎవరికీ వుండదు. ఇది కేవలం స్పోర్టివ్ సినిమా థియేటర్‌లోనే సంభవిస్తుంది. ఎన్ని మార్పులు వచ్చినా దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. #Vikram ని థియేటర్లలో చూసి ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను అని అన్నారు.

    సూర్య పాత్ర గురించి

    సూర్య పాత్ర గురించి

    విక్రమ్ సినిమాలో సూర్య పాత్ర గురించి కమల్ వెల్లడిస్తూ.. సూర్య స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపిస్తారు. నిజానికి హీరో ని బుక్ చేసేటప్పుడు నేరుగా కలసి బోకే ఇచ్చి బుక్ చేస్తారు. నేను కూడా సూర్యకి ఒక బోకే ఇద్దామని అనుకున్నా. విక్రమ్ స్పెషల్ రోల్ గురించి కలసి మాట్లాడదామని ఫోన్ చేశా.

    కానీ ఫోన్ కాల్ లోనే అంతా అయిపొయింది. ''నేను చేస్తా అన్నయ్యా'' అన్నారు. నేను వెళ్ళేటప్పటికి మొత్తం అయిపొయింది. బోకే ఇవ్వడం ఇంక కుదరలేదు(నవ్వుతూ). షేక్ హ్యాండ్ తో సరిపెట్టుకున్నాం అని అన్నారు.

    కథ గురించి కమల్ హాసన్

    కథ గురించి కమల్ హాసన్

    Vikram కథలో ప్రతి పాత్రకు 2 కోణాలు ఉంటాయి. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. విక్రమ్ గ్రేట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి. తప్పకుండా ఈ సినిమా గొప్ప అనుభూతిని పంచుతుంది అని కమల్ హాసన్ చెప్పారు.

    తెలుగులో హీరో నితిన్ రిలీజ్

    తెలుగులో హీరో నితిన్ రిలీజ్

    విక్రమ్ చిత్రం 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవరాల్‌గా 198.75 కోట్లుగా నమోదైంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే సుమారు 50 కోట్ల లాభం దక్కింది. తెలుగులో హీరో నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రైట్స్‌ను 6 కోట్ల రూపాయల డీల్‌తో నితిన్ ఫ్యామిలీ చేజిక్కించుకొన్నది.

    English summary
    Universal Star Kamal Haasan's Vikram movie releasing on April 03rd. Here is the movie highlights of Vikram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X