»   » మర్మయోగి అంతే, విశ్వరూపంపై లోక్‌నాయక్ పాట్లు

మర్మయోగి అంతే, విశ్వరూపంపై లోక్‌నాయక్ పాట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రయోగాత్మక సినిమాలన్నా...ప్రయోగాత్మక పాత్రలన్నా మనకు ముందు గుర్తొచ్చే పేరు ది గ్రేట్ యాక్టర్ పద్మశ్రీ కమల్ హాసనే. అందుకే ఆయన ఇండియన్ టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిరారు. సినిమాల్లో డబల్ రోల్, త్రిబుల్ రోల్ చేయడం లాంటివి దాదాపు ఏ హీరో అయినా చేస్తాడు. కానీ ఒకే సినిమాలో 10 భిన్నమైన రోల్స్ చేయడం ఒక్క కమల్ హాసన్ వల్లనే సాధ్యం. ప్రేక్షకులకు మంచి సందేశం ఇచ్చే సినిమా అయినా....కేవలం నవ్వులు పంచే సినిమా అయినా పాత్రకు తగిన విధంగా తను మారి పోవడం కమల్ స్టయిల్.

ఇప్పటి వరకు దాదాపు అన్ని రకాల పాత్రల్లో నటించిన కాదు కాదు..జీవించిన కమల్ ప్రస్తుతం కెరీర్ చివరాంకంలో ఉన్నారు. అందుకే ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండి పోయే విభిన్నమైన, చారిత్రాత్మ సినిమా తీయాలనే కృత నిశ్చయానికి వచ్చాడు. ఆ మధ్య 'మర్మయోగి" సినిమా చేస్తున్నట్లు వెల్లడించడమే కాదు..ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు అని ప్రకటించాడు.

సినిమా షూటింగ్ ప్రారంభం సందర్బంగా బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ను కూడా ఆహ్వానించారు. అయితే సినిమా అర్ధాంతం ఆది పోయింది. ఈ సినిమా తీయడానికి తన వద్ద ఉన్న రూపాయలు సరిపోవని, డాలర్లు కావాలని, అవి తన వద్ద ఉన్నప్పుడే సినిమా తీస్తానని 'మర్మ యోగి"ని పక్కన పెట్టాడు.

ఇటీవలే 'విశ్వరూపం" సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రకటించాడు. 75 రోజుల అమెరికాలో షూటింగ్ జరుపాలని నిర్ణయించుకున్నాడు. యుగానికొక్కడు దర్శకుడైతే ఈ సినిమాకు కరెక్ట్ అని అతన్ని దర్శకుడిగా నియమించుకున్నాడు. అయితే షూటింగ్ ప్రారంభం కాగటానే డైరెక్టర్ సెల్వరాఘవన్ తప్పుకున్నాడు. దీంతో తానే దర్శకత్వ బాధ్యతలను నెత్తినేసుకున్నాడు. అంతా ఓకే అయిందనే సమయంలో తొలుత హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించిన సోనాక్షి సిన్హా డేట్లు లేవనే సాకుతో హ్యాండిచ్చింది. మళ్లీ కొన్ని రోజులు హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించి చివరకు సమీరారెడ్డిని ఎంచుకున్నాడు. ఇందులో సమీర కమల్ భార్యగా నటించనుంది. ఇంకా ఇందులో అనేక ముఖ్య పాత్రలకు నటుల ఎంపిక జరుగాల్సింది.

విశ్వరూపం సినిమాకు 'మర్మయోగి" గతి పట్టకూడదని తెగ కష్ట పడుతున్నాడు. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇదో భారీ బడ్జెట్ సినిమా. మరి కమల్ డ్రీమ్ ప్రాజెక్టు సక్సెస్...రేట్ ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ....

English summary
Kamal Hassan is doing hard work to his up coming movie viswaroopam. It is one of the high budget movie in India film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu