»   » బ్రిటన్ రాణిను కలిసిన కమల్‌హాసన్‌, మళ్లీ 'బాహుబలి -2' అప్పుడే...

బ్రిటన్ రాణిను కలిసిన కమల్‌హాసన్‌, మళ్లీ 'బాహుబలి -2' అప్పుడే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: దక్షిణాది బాషల్లో అద్బుతమైన నటుడుగా పేరు తెచ్చుకున్న యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్‌ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2ను కలిశారు. ఇటీవల బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ఇండో-యూకే కల్చరల్‌ ఎక్స్ఛేంజి సెలబ్రేషన్స్‌ 2017 కార్యక్రమంలో కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌ మంచి ఆరోగ్యంతో ఉన్నారని, ఆమె భారత్‌ పర్యటనను గుర్తుంచుకున్నారని కమల్‌హాసన్‌ తెలిపారు.

డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరో ప్రిన్స్‌ ఫిలిప్‌ కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. 1997లో క్వీన్‌ ఎలిజబెత్‌ భారత పర్యటనలో భాగంగా చెన్నైకి వెళ్లారు. అప్పుడు ఆమె మరుదనాయగం సినిమా సెట్‌కు రావడాన్ని కమల్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కమల్‌హాసన్‌ ఎలిజబెత్‌తో ఫొటో దిగారు. బహుశా రాణి వెళ్లిన ఒకే ఒక సినిమా షూటింగ్‌ అదే అయి ఉంటుందని అనుకుంటున్నానని కమల్‌హాసన్‌ అన్నారు.

Kamal Hasaan meets Queen of England at UK India 2017

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో ఈ టీమ్ బ్రిటన్‌కు వెళ్లింది. ఈ వేడుకల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కమల్‌హాసన్‌ పేరును సూచించారు. క్వీన్‌ ఎలిజబెత్‌తో పాటు డ్యూక్‌ అండ్‌ డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ విలియం, కేట్‌, డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరో ప్రిన్స్‌ ఫిలిప్‌, డ్యూక్‌ అండ్‌ డచెస్‌ ఆప్‌ గ్లోసెస్టర్‌, ప్రిన్స్‌ మైకేల్‌ తదితర రాజకుటుంబీకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు తన పేరు ప్రతిపాదించినందుకు కమల్‌ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

మరో ప్రక్క బిజినెస్ నుంచి ప్రమోషన్ వరకూ అన్ని విషయాల్లో రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న 'బాహుబలి 2' చిత్రం ప్రీమియర్‌ షో ను ముందుగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 చూడనున్నట్లు సమచారం.

Kamal Hasaan meets Queen of England at UK India 2017

స్వతంత్ర భారతదేశం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 24న బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 'ఇండియా ఆన్‌ ఫిల్మ్‌' కార్యక్రమంలో పలు భారత సినిమాలను ప్రదర్శించనుంది. ఇందులో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'ను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ షోకు క్వీన్‌ ఎలిజబెత్‌-2, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

English summary
Actor Kamal Hasaan, who attended the reception hosted by Queen Elizabeth II in Buckingham Palace, recollected his 'Marudhanayagam' shooting days when she had visited his film's sets back in October 1997, during her brief stay in India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu