»   »  రాజమౌళిని బోల్తా కొట్టించిన కమల్ ఫేక్ ట్వీట్

రాజమౌళిని బోల్తా కొట్టించిన కమల్ ఫేక్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళిని ఓ ట్వీట్ బోల్తా కొట్టించింది. కమల్ హాసన్ పేరు మీద ట్విట్టర్ లో మొదలైన ఓ ఎక్కౌంట్ చాలా మందిని బోల్తా కొట్టించింది. అది కమల్ అసలైన అక్కౌంట్ గా భావించిన కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్ లో కమల్ కు ఆహ్వానం పలికారు కూడా.

వారిలో డైరక్టర్ రాజమౌళి, హరీశ్ శంకర్, హీరో నాని ఉన్నారు. ఆ ట్విట్టర్ ఐడి...@maiamkhassan. తను ట్విట్టర్ ఎక్కౌంట్ ఓపెన్ చెయ్యటానికి శేఖర్ కపూర్ ప్రేరణ ఇచ్చారని ఆ ట్వీట్ లో ఉంది. ఈ విషయాన్ని ఆయన మొదటి ట్వీట్ గా రాసారని అంతా భావించారు.

ఈ విషయమై కమల్ అథికార ప్రతినిథి నిఖిల్ మురుగన్ ...కమల్ సార్ ట్విట్టర్ లో లేరు. ఆయన పేరు మీద ప్రారంభమైన అక్కౌంట్ నిజమైనది కాదు. దాన్ని నమ్మవద్దు. దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తిపై త్వరలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. అని ట్వీట్ చేసారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కమల్ పేరు మీద అక్కౌంట్ తెరిచిన వ్యక్తి తన ప్రఫైల్ ని తీసివేయటం గమనార్హం.

ప్రస్తుతం కమల్ తాజా చిత్రం 'విశ్వరూపం 2' లో బిజీగా ఉన్నారు. . థాయ్‌లాండ్‌ సముద్ర తీర ప్రాంతాల్లో 'విశ్వరూపం 2' ఫైట్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కమల్‌, ఆండ్రియాలపై షూటింగ్ సాగుతోంది.

ఈ రెండో భాగంలో కథ చాలా వరకూ మన దేశం నేపథ్యంగానే సాగుతుంది. త్వరలో ఢిల్లీలో కొన్ని ఘట్టాలు చిత్రించబోతున్నారు. 'విశ్వరూపం 2'ని ఆగస్టులో విడుదల చేయాలన్నది కమల్‌హాసన్‌ ఆలోచన. తొలి భాగంలోని నటీనటులు చాలామంది కొనసాగింపులోనూ నటిస్తున్నారు.

English summary

 kamal hassan's official spokesperson made it clear that Kamal twitter ID was fake. He tweeted as,’ Dear all Kamal
 Sir is not in twitter..the ID..maiamkhassan..is fake and pls don't
 believe.legal action soon to the person who operates..’
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu