»   »  'రోబో-2' తర్వాత శంకర్ చేయబోయే సినిమా ఇదే

'రోబో-2' తర్వాత శంకర్ చేయబోయే సినిమా ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కమలహాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు' చిత్రం ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలిసిందే. ఆ చిత్రం క్లైమాక్స్ లో ఈ దేశం మళ్లీ నన్ను కోరుకున్నప్పుడు మళ్లీ వస్తా అనే ఎండ్ నోట్ తో ముగుస్తుంది. అంటే అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచన దర్శక,నిర్మాతలకు ఉందన్నమాట.

Kamal Hassan & Shankar are back again with 'Bharateeyudu 2'

అసలు ఈ సినిమాతోటే నిర్మాత ఏఎమ్ రత్నం కు అంతర్జాతీయంగా పేరు వచ్చింది. దేశమంతటా ఎవరీ భారీ ప్రొడ్యూసర్ అంటూ మారు మ్రోగింగి. దాంతో ఈ సినిమాపై ఆయనకు మక్కువ ఎక్కువ. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఇటీవలే శంకర్, ఏఎమ్ రత్నం అనుకున్నారట.

Kamal Hassan & Shankar are back again with 'Bharateeyudu 2'

నిర్మాత రత్నం మాట్లాడుతూ.. - ''శంకర్ నాకు అత్యంత సన్నిహితుడు. ఇటీవల మేమిద్దరం కలిసినపుడు 'భారతీయుడు-2' గురించి చర్చ వచ్చింది. ఎలా చేయాలో ఇద్దరం ఆలోచించుకున్నాం. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియమ్‌కి వెళ్లినప్పుడు కూడా మా ఇద్దరి మధ్య ఇదే చర్చ.

కానీ అకస్మాత్తుగా శంకర్ 'రోబో-2' చేయాల్సి వస్తోంది. 'రోబో-2' తెలుగులో నేనే విడుదల చేస్తా, అలాగే 'భారతీయుడు-2' ఎప్పటికైనా నిర్మిస్తా'' అన్నారు.

Kamal Hassan & Shankar are back again with 'Bharateeyudu 2'

అలాగే ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఇటీవల ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. "భారతీయుడు" ఎప్పుడు మొదలవుతుంది? ఎవరు నిర్మిస్తారు? హీరోయిన్స్ గా ఎవరు నటిస్తారు? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.

Kamal Hassan & Shankar are back again with 'Bharateeyudu 2'

అసలు కమల్ తో శంకర్ అప్పట్లో ఒకే ఒక్కడు చిత్రం చేద్దామనుకున్నారు. కానీ ఆయన హే రామ్ చిత్రం బిజీలో ఉండటంతో అర్జున్ తో ఆ ప్రాజెక్టు చేసారు. దర్శకుడు శంకర్ ప్రస్తుతం రజనీకాంత్ తో "రోబో 2.0" తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం ఆయన కమల్ హాసన్ తో కలిసి పని చేయనున్నాడని తెలుస్తోంది.

English summary
AM Ratnam confirms 'Bharateeyudu' sequel in the combination of Kamal Hassan and Shankar. Shankar could take up 'Bharateeyudu 2' after the completion of 'Robo 2.0'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu