twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశ్వరూపం : కమల్ విత్ డ్రా, జరిమాన వేస్తామని కోర్టు హెచ్చరిక

    By Bojja Kumar
    |

    చెన్నై: విశ్వరూపం చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం రెండు వారాల బ్యాన్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం ఆ పిటీషన్‌ను కమల్ హాసన్ విత్ డ్రా చేసుకున్నాడు. ముస్లింఘాలతో చర్చలు జరిపిన కమల్ హాసన్ వారి డిమాండ్ మేరకు కొన్ని సీన్లకు కత్తెర వేసి 'విశ్వరూపం' సినిమా విడుదలకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన పిటీషన్ వెనక్కి తీసుకున్నారు.

    ముస్లిం సంఘాలకు కమల్‌హాసన్‌ ఇచ్చిన హామీ మేరకు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలను తొలగించి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీనిని ఈనెల 6 లేదా 7వ తేదీల్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ వ్యవహారం మొత్తంలో కమల్ హాసన్ కు తమిళ సినీ పరిశ్రమ అండగా నిలిచింది.

    ఇటీవల బ్యాన్ విధించిన సమయంలో కమల్ హాసన్ మీడియా ముందు ఉద్వేగంగా స్పందించారు. ఒక సయమంలో దేశ వదిలి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేసారు. కానీ పట్టుదలకు పోతే తనకే నష్టమని భావించి చివరకు రాజీ మార్గంలో నడిచి సినిమాకు ఉన్న అడ్డంకులను తొలగించుకున్నాడు.

    విశ్వరూపానికి వ్యతిరేకంగా అసంతపూర్తి వ్యాజ్యం-జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరిక

    విశ్వరూపం చిత్రాన్ని నిషేదించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో ఏది అభ్యంతర కరమో, ఏది కాదో అనే విషయాలు వెల్లడించకుండా అసంపూర్తిగా వ్యాజ్యం ఏమిటని ప్రశ్నించింది. మరోసారి ఇలా అసంతపూర్తిగా వ్యాజ్యం వేస్తే రూ. 50 వేల జరిమానా విధిస్తామని పిటీషనర్ తరుపు న్యాయవాదిని కోర్టు హెచ్చరించింది. వెంటనే వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని పూర్తి వివరాలతో పిటీషన్ దాఖలు చేయాలని విచారణ ముగించింది.

    కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. బ్యాన్ కారణంగా ఈ చిత్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్ట పోయింది.

    English summary
    As a result of the five-hour-long tripartite meeting on Saturday, the two-week ban on Kamal Hassan’s ‘Vishwaroopam’ has now been lifted and the actor has withdrawn his petition from the Madras High Court on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X