»   » కమల్ 'కాందహార్'

కమల్ 'కాందహార్'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mohanlal
కమల్ హాసన్,మోహన్ లాల్ కలసి మొదటిసారిగా 'కాందహార్' పేరుతో ఓ సినిమా చేయనున్నారు. డిసెంబర్ 99 కాందహార్ లో జరిగిన హైజాకింగ్ ఆధారంగా ఈ చిత్రం తియ్యనున్నారని తెలుస్తోంది. మేజర్ రవి డైరక్ట్ చేయనున్న ఈ సినిమా పూర్తిగా రక్షణ విభాగంలోని లోటుపాట్లు ...దాని ఫలితాలు ఆధారంగా ఉంటుందంటున్నారు. అసలు దర్శకుడుకి ఈ ఆలోచన మొదట్లో సినిమాలకు మిలటరీ విషయాల కన్సలటెంట్ గా చేస్తున్నప్పుడు వచ్చిందిట. అతను మొదటి సారిగా మోహన్ లాల్ హీరోగా కీర్తిచక్ర (2006)అనే సినిమాని తీసాడు. తర్వాత ముమ్మట్టి ప్రధాన పాత్రలో 'మిషన్ 90 డేస్' అనే సినిమాను రూపొందించాడు. రాజీవ్ గాంధీ హత్య నేఫద్యంలో తీసిన ఆ సినిమా మంచి పేరే తెచ్చుకుంది. కానీ వర్కవుట్ కాలేదు. ఇక 'కాందహార్' సినిమా 2009 సగం లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X