twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ ,కోర్టు తీర్పు పై కమల్ వ్యంగ్య వ్యాఖ్యలు(ఇంటర్వూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ :యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ నటించిన సరికొత్త చిత్రం ‘ఉత్తమ విలన్‌'. ఈ చిత్రం మే 1న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ బాగా పెంచారు. ప్రమోషన్‌లో భాగంగా కమల్‌ తన టీమ్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. హోటల్‌ పార్క్‌ హయాత్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆ మాటల్లో భాగంగా ఆయన సెన్సార్ బోర్డ్ ని పూర్తి స్ధాయిలో విమర్శించారు. ఆయనేం అన్నారు అనేది ...ఇంటర్వూ తో కలిపి మీకు అందిస్తున్నాం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కమల్ మాట్లాడుతూ..‘‘ఈ చిత్రం ఒక యాక్టర్‌ లైఫ్‌ గురించి తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ, ఈ సినిమా స్పెషల్‌గా వుంటుంది. ఇందులోని విషయాల్ని చాలా డిఫరెంట్‌గా చూపిస్తున్నాము. ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడికి తప్పనిసరిగా నచ్చుతుందని భావిస్తున్నాను'' అని తెలిపారు.

    అలాగే ...అందరిలోనూ ఒక విలన్‌ వుంటాడు. నేను చేసే కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అందరూ విలన్స్‌ అయిపోతారు. అలా ఈ సినిమాలో ఒక పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో నేను విలన్‌ని అని చెప్పుకొచ్చారు.

    స్లైడ్ షో లో కమల్ ఇంటర్వూ...

    సెన్సార్ పై విమర్శ..

    సెన్సార్ పై విమర్శ..

    ''సినిమా తీయడం కొద్ది కొద్దిగా నేర్చుకొంటున్నా. ఒక సినిమా చేసిన తర్వాత కొంతమంది వచ్చి టిక్కెట్‌ లేకుండా చూస్తామంటారు. అది కొత్త పద్ధతి. దానికీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా. వాళ్లు సినిమా చూడాలి... కానీ టిక్కెట్‌ కొనరు. చూశాక... అది విడుదల చేయాలా వద్దా అనేది కూడా వాళ్లే చెబుతారట. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి జరగకూడదు కదా?'' అని వ్యాఖ్యానించారు కమల్‌ హాసన్‌.

    రకరకాల అనుభవాలు

    రకరకాల అనుభవాలు

    ''ఒక సినిమా ఎలా మొదలుపెట్టి, ఎలా పూర్తి చేయాలో నేర్చుకొన్నా. విడుదలకి వచ్చేసరికి రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి.

    చెన్నై లో కేసు

    చెన్నై లో కేసు

    ఇటీవల 'ఉత్తమ విలన్‌'పై చెన్నైలో కేసు వేశారు. 'మీకు వేరే పని లేదా?' అంటూ కేసు వేసిన వాళ్లనే తప్పుపట్టారట న్యాయమూర్తి.

    ఏ ఇబ్బంది ఉండదూ

    ఏ ఇబ్బంది ఉండదూ

    నేను ప్రేక్షకులకు చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి. ఎవరి పనిని వాళ్లు బాగా చేసుకొంటూ వెళితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

    ఎలా పోగొట్టుకుంటాను...

    ఎలా పోగొట్టుకుంటాను...

    హిందువులు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో హిందూ ప్రేక్షకుల్ని పోగొట్టుకొనేలా ఎలా సినిమా తీయగలను? అంతే కాదు ముస్లింలకు, జైనులకు, సిక్కులకు వ్యతిరేకంగా నేనెందుకు సినిమా చేయాలి? అందరూ నా కుటుంబ సభ్యులే. నేను అందరినీ ప్రేమిస్తాను. మనది వసుధైక కుటుంబం అనుకొనే కళాకారుడిని నేను.

    పార్టీల కోసం తీయను

    పార్టీల కోసం తీయను

    నాకు రాజకీయాలు తెలియవు. కాంగ్రెస్‌ సినిమాలు తీయను, భాజపా సినిమాలు తీయను. పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం సినిమాలు చేస్తుంటాను''.

    అది నా తప్పు కాదు

    అది నా తప్పు కాదు

    ''సున్నితమైన కథాంశాలు ఎంచుకొంటున్నందుకే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో అంటున్నారు చాలామంది. అది నా తప్పు కాదు. బాలచందర్‌గారు నాకలా నేర్పించి వెళ్లారు.

    ఎవరూ భాధపడవద్దు..

    ఎవరూ భాధపడవద్దు..

    నా సినిమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి కదా అని అభిమానుల్వెరూ బాధపడకండి. అడ్డుగా నిలిచేవాళ్లు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. అల్పసంఖ్యాకులకు మనం ఎప్పుడూ స్నేహహస్తమే అందించాలి. అది ప్రజాస్వామ్యానికే అందం''.

    డిమాండ్‌ చేస్తేనే

    డిమాండ్‌ చేస్తేనే

    '' ఉత్తమ విలన్ లో రకరకాల వేషాలున్నాయి. ఏ వేషమైనా కథ, పాత్ర డిమాండ్‌ చేసినప్పుడే వేయాలి. నాకు నేనుగా పనిగట్టుకొని ఎప్పుడూ గెటప్‌ కోసం ప్రయత్నించను''.

    విలన్ లు గా మారుస్తాయి...

    విలన్ లు గా మారుస్తాయి...

    ప్రతి ఒక్కరిలోనూ విలన్‌ ఉంటారు. ఆయా పరిస్థితులే వాళ్లని విలన్‌లుగా మారుస్తాయి. ఎవరి దృష్టిలో ఎప్పుడెవరు ఎలా కనిపిస్తారన్నదే ఈ చిత్రం. ఒక సినిమా కళాకారుడి జీవితం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ పాత్ర చేయడానికి చాలా మంది నటులు స్ఫూర్తి, అందులో నేనూఒకణ్ని. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. కథని చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది.

    ఆ డ్యాన్స్‌ ప్రత్యేకం

    ఆ డ్యాన్స్‌ ప్రత్యేకం

    '' 'ఉత్తమ విలన్‌' కోసం చాలా కష్టపడ్డాం. ఇందులో ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్‌ డ్యాన్స్‌ కొత్తగా ఉంటుంది. భారతీయ సినిమాల్లో ఇప్పటిదాకా అలాంటి డ్యాన్స్‌తో పాట రూపుదిద్దుకోలేదని సగర్వంగా చెబుతాను. హాలీవుడ్‌ సినిమాల్లోని స్పష్టత అందులో కనిపిస్తుంది.

    కమర్షియలే..

    కమర్షియలే..

    వంద శాతం కమర్షియల్‌ కోణంలో తెరకెక్కిన చిత్రమిది. సినిమాని కళారూపం, వాణిజ్య రూపం అని విడదీసి చూడలేం. డబ్బు పోయినా ఫర్వాలేదు అని ఎవ్వరూ సినిమా చేయరు. సత్యజిత్‌రేగారు కూడా విజయం వస్తే వద్దనలేరు. నాకు అవార్డు చాలని ఆయన చెప్పరు''.

    జన్యు సంభందం ఉంది

    జన్యు సంభందం ఉంది

    గురువుగారు బాలచందర్‌తో పాటు, కె.విశ్వనాథ్‌గారితో కలిసి ఇందులో నటించా. వాళ్లతో ఇదివరకు చాలా సినిమాల్లో నటించా. బాలచందర్‌గారి దర్శకత్వంలో 36 సినిమాలు చేశాను. తొలి 5, 6 సినిమాల వరకు ప్రతిదీ ఆయనే నేర్పించేవారు. వారిద్దరినీ రెండు పరిశ్రమల్లోనూ ఎంతో ఆరాధిస్తారు. వాళ్ల పిల్లలమే మేము. నటన అనే జన్యు సంబంధం మా మధ్య ఉంది.

    ఎప్పుడైనా...

    ఎప్పుడైనా...

    ''సినిమాని డీటీహెచ్‌లో విడుదల చేయాలన్న నా ప్రయోగం ఇంకా ఆగలేదు. ప్రయోగ దశలో ఉంది. అది ఎప్పుడైనా బయటికి రావొచ్చు'' అన్నారు కమల్‌.

    అమీర్ ఖాన్ మద్దతు సరిపోలేదు

    అమీర్ ఖాన్ మద్దతు సరిపోలేదు

    డీటీహెచ్‌ విషయంలో మద్దతునివ్వలేకపోయానని ఆమీర్‌ ఖాన్‌ క్షమాపణలు చెప్పి నాకు మద్దతునిచ్చారు. కానీ ఆయన మరిచిపోయారు. ఇంత పెద్ద గొడవ జరిగినప్పుడు ఆయన పలికిన మద్దతు సరిపోలేదంతే'' అని చెప్పారు.

    తెలుగులో...

    తెలుగులో...

    నేరుగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు కమల్‌. తన శిష్యుడే ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని తెలిపారు కమల్‌.

    ద్విపాత్రాభినయం...

    ద్విపాత్రాభినయం...

    కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘ఉత్తమవిలన్‌'. ఎన్‌.లింగుస్వామి, కమల్‌హాసన్‌ నిర్మాతలు.

    నిర్మాణం...

    నిర్మాణం...

    తిరుపతి బ్రదర్స్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    కీలక పాత్రల్లో...

    కీలక పాత్రల్లో...

    ఆండ్రియా జెరీమియా, పూజా కుమార్‌, పార్వతి, జయరామ్‌, పార్వతి నాయర్‌ కీలక పాత్రధారులు.

    అదే పేరుతో..

    అదే పేరుతో..

    ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

    English summary
    Kamal Haasan talks about his latest movie Uttama Villan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X