»   » ఇంట్రస్టింగ్: కమల్ 'చీకటి రాజ్యం' ట్రైలర్‌ -2 (వీడియో)

ఇంట్రస్టింగ్: కమల్ 'చీకటి రాజ్యం' ట్రైలర్‌ -2 (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కమల్‌హాసన్‌, త్రిష, ప్రకాశ్‌రాజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'చీకటి రాజ్యం'. ఈ చిత్రం ట్రైలర్‌-2ను విడుదల చేసినట్లు కమల్‌హాసన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు.

Presenting you the Official Trailer #2 of #CheekatiRaajyam.https://youtu.be/N4UqBVqM8jM


Posted by Kamal Haasan on 3 November 2015

తెలుగు, తమిళ్‌ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి రాజేశ్‌ యం సెల్వమ్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌. చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 10న 'చీకటి రాజ్యం' ప్రేక్షకుల ముందుకు రానుంది.


చిత్రం విశేషాలకు వస్తే...


కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై... కమల్ సోదరుడు చంద్రహసన్ నిర్మిస్తున్న చిత్రం చీకటిరాజ్యం. కమల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేశ్.ఎమ్.సెల్వ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


రాజేశ్.ఎమ్.సెల్వ మాట్లవాడుతూ...ఈ సినిమా గురించి బయట సాగుతున్న ప్రచారం మాకే కొత్తగా ఉంది. ఇది ఓ ఫ్రెంచి నవల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందుకోసం సంబంధిత రచయిత వద్ద హక్కులు పొంది.. అధికారికంగా సినిమాను తెరకెక్కిస్తున్నాం. అంతలోపు ఇది ఫలానా సినిమా రీమేక్‌, మరో సినిమా సన్నివేశాలు ఆధారంగా తీస్తున్నారు.. వంటి వదంతులన్నీ పొక్కాయి అని అన్నారు.


Kamal's Cheekati Raajyam Official Trailer - 2 released

ఇందులో ప్రకాశ్‌రాజ్‌ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కిశోర్‌, ఆషాశరత్‌, సంపత్‌రాజ్‌, యూగిసేతు, మధుశాలిని, ఉమారియాజ్‌, సంతానభారతి, జగన్‌.. ఇలా చాలా మంది నటిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ కీలకమైనవారే. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలుండవు. ప్రేక్షకుడిని ప్రభావితం చేసేలా పాత్రలను రూపకల్పన చేశాం.


ఈ చిత్రంలో కమల్ నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో వింగ్ కు చెందిన ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నార్కోటిక్స్ ప్రపంచంలోని కొందరు వ్యక్తులు తన కుమారుడుని కిడ్నాప్ చేస్తే ఎలా వారిని ఎదుర్కొని, వెనక్కి తెచ్చుకున్నాడనే కథాంశంతో నడుస్తుందని చెప్తున్నారు.


కమల్ మాట్లాడుతూ..‘‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. నాలుగు విభిన్న పాత్రల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులు తమని తాము మర్చిపోయి సినిమాలో లీనమైపోతారు. గిబ్రాన్ మంచి సంగీతం అందించాడు''అని తెలిపారు.

English summary
Veteran hero Kamal Haasa latest thriller treat "Cheekati Rajyam" released Official trailer .
Please Wait while comments are loading...