twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ స్క్రీన్ ప్లే వర్క్ షాప్

    By Staff
    |

    Screen Writing
    కమల్ హాసన్ సినీ ప్రియులకోసం ఓ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ ప్లాన్ చేసారు. ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో ఈ వర్క్ షాప్ మే ఇరవై తొమ్మిదవ తేదీ నుంది జూన్ మూడవ తేదీ వరకూ జరగుతుంది. ఈ వర్క్ షాప్ లో బెస్ట్ స్క్రీన్ రైటర్స్, ఫిల్మ్ మేకర్స్ ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక ప్రముఖ స్క్రీన్ ప్లే రచయిత Jean Claude Carriere వీడియో కాన్ఫెరెన్స్ ని సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కమల్ సైతం ఈ వర్క్ షాప్ లో స్వయంగా డిస్కషన్ లో పాలుపంచుకుని తన అనుభవ పాఠాలను వివరిస్తారు.

    ఇక ఈ వర్క్ షాప్ ని కె.హరిహరన్ నిర్వహించనున్నారు. ఆయన ఎల్.వి.ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ డైరక్టర్. అలాగే పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్క్రీన్ రైటింగ్ డిపార్ట్ మెంట్ హెడ్ అంజుమ్ రాజబలి, విజులింగ్ ఉడ్సా అతుల్ తివారి,తదితరులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హరిహరన్ మాట్లాడుతూ మేం స్క్రీన్ రైటింగ్ ని రెండు కోణాల్లో వివరించబోతున్నాం. ఒకటి మనం పేపరుపై రాసుకున్న పదాల్ని తెరపై ఇమేజస్ గా ఎలా మార్చాలి,రెండవది మన మనస్సులో ఉన్న ఇమేజెస్ ని పదాలుగా పేపరుపై ఎలా రాయాలన్నది అంటున్నారు. వీటన్నిటితో పాటు ప్రతీ రోజూ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ రచయితలతో గెస్ట్ లెక్చర్స్ ఇప్పింస్తామంటున్నారు.

    ఇక ఈ వర్క్ షాప్ ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ వారు సమర్పిస్తున్నారు.ఈ విషయంపై కమల్ మాట్లాడుతూ..ఇది స్ట్రిక్ట్ గా ఓ ఇంస్ట్రక్టనల్ ఈవెంట్. ఈ వర్క్ షాప్ కి అటెండ్ కాదలచుకున్న వారు కంపల్సరిగా బేసిక్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఆ వర్క్ షాప్ లో పాల్గొనటానికి తమకున్న సీరియస్ నెస్ ఎంతుందో, ఎంత వరకూ తాము అర్హులమో క్లియర్ గా స్పష్టం చేయాలి..250 మందిని ఈ పోగ్రామ్ కోసం సెలక్ట్ చేస్తాం...అన్నారు. ఇక మీరు ఈ వర్క్ షాప్ లో పాల్గొనాలంటే ఓ పాస్ పోర్ట్ ఫొటో కలిగిన రెస్యూమ్ పంపాలి.

    మీ కిష్టమైన సినిమా గురించి రెండువందల పదాల్లో సినాప్సిస్ రాయాలి. అలాగే ఇష్టమైన ఐదు సినిమాలు రాయాలి.

    అనంతరం [email protected] కి మెయిల్ పంపాలి.
    ఇంకా వివరాలు కావాలంటే http://screenwritingindia.com సైట్ కెళ్ళండి.
    లేదా [email protected] మెయిల్ చేయండి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X