»   »  కమల్ ఎంతమాట అనేసావ్..!?: రజినీకి ఇది అవమానమే, తలైవా అభిమానుల ఆగ్రహం

కమల్ ఎంతమాట అనేసావ్..!?: రజినీకి ఇది అవమానమే, తలైవా అభిమానుల ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kamal Hasan Sensational Comments On Rajinikanth కమల్ ఎంతమాట అనేసావ్..!?

రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తార‌న్న ప్ర‌చారంలో నిజం ఉంద‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు.. తాను కొత్త పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పారు క‌మ‌ల్ హాస‌న్‌. అవును కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముందని కమల్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

విజయదశమికి పార్టీ ఏర్పాటు

విజయదశమికి పార్టీ ఏర్పాటు

జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ సమీకరణలు మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమల్‌ కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని రాజకీయ పార్టీ ఏర్పాటుపై సంకేతాలిచ్చాడు కమల్. ఈ మేరకు విజయదశమికి పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

విప్ల‌వాత్మ‌క భావ‌జాలానికి అనుగుణంగా లేవు

విప్ల‌వాత్మ‌క భావ‌జాలానికి అనుగుణంగా లేవు

అంతే కాదుతాను వామహస్తాలతో కలవబోతున్నాడంటూ వచ్చిన వార్తలని కూడా ఖండించాడు కమల్ ప్ర‌స్తుతం ఉన్న ఏ పార్టీ త‌న విప్ల‌వాత్మ‌క భావ‌జాలానికి అనుగుణంగా లేవ‌ని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే కొత్త పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లు కూడా ఈ సంద‌ర్భంగా అత‌ను తెలిపాడు.

క‌మ్యూనిస్ట్ పార్టీపై ప్రేమ పెంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు

క‌మ్యూనిస్ట్ పార్టీపై ప్రేమ పెంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు

తాను ఏ పార్టీ నేత‌ను క‌లిస్తే ఆ పార్టీతో త‌న‌కు లింకు పెట్ట‌డంపై కూడా క‌మ‌ల్ స్పందించాడు. మొన్న నేను కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ను క‌లిశాను. అలాగ‌ని క‌మ్యూనిస్ట్ పార్టీపై ప్రేమ పెంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయ పార్టీ అంటే భావ‌జాలం. నాకు తెలిసి రాజ‌కీయాల్లో నా ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి కావాల్సిన భావ‌జాలం ప్ర‌స్తుతం ఏ పార్టీకి లేదు అని క‌మ‌ల్ స్ప‌ష్టంచేశాడు.

ర‌జ‌నీ అభిమానులు మంట పుట్టేలా

ర‌జ‌నీ అభిమానులు మంట పుట్టేలా

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. తాజాగా కమల్ చేసిన ఒక వ్యాఖ్య త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ అభిమానులు మంట పుట్టేలాఉంది. త‌న మాదిరే త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని.. పార్టీ పెడ‌తారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతున్న ర‌జ‌నీపై క‌మ‌ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశాడు. ఒక రకంగా ఇది అభిమానులను రెచ్చగొట్టే చర్యగానే అభివర్నిస్తున్నాయి తమిళ రాజకీయ వర్గాలు.

ర‌జ‌నీకాంత్ ఇష్ట‌ప‌డితే

ర‌జ‌నీకాంత్ ఇష్ట‌ప‌డితే

ర‌జ‌నీకాంత్ ఇష్ట‌ప‌డితే ఆయ‌న్ను త‌న పార్టీలో చేర్చుకోవ‌టానికి ఎలాంటి అభ్యంత‌రం లేదంటూ చేసిన వ్యాఖ్యలు రజినీ అభిమానులని గట్టిగానే హర్ట్ చేసాయి. ర‌జ‌నీ ఉద్దేశ‌మేమిటో త‌న‌కుతెలీద‌ని చెప్పిన క‌మ‌ల్ మాట‌లు స‌గ‌టు ర‌జ‌నీ అభిమానిని ఎంత‌గా మండిప‌డేలా చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

రాజ‌కీయాల్లోకి వ‌స్తే

రాజ‌కీయాల్లోకి వ‌స్తే

అత్యంత ఆద‌ర‌ణ ఉన్న క‌థానాయ‌కుడిగా.. రాజ‌కీయాల్లోకి వ‌స్తే అధికారం ఆయ‌న సొంతం అన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. అలాంటి ర‌జ‌నీని త‌న పార్టీలోకి వ‌స్తే చేర్చుకుంటాన‌ని క‌మ‌ల్ చెప్ప‌టంపై ర‌జ‌నీ అభిమానుల‌కు మింగుడుప‌డ‌ని అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

English summary
"There are questions whether I will join hands with Rajinikanth+ in politics. If Rajini enters politics, I'll join hands with him," said Kamal Haasan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu