»   » సావిత్రికి చాలా మందితో సంబంధాలు.. అందులో మా నాన్న ఒకరు.. జెమినీ కూతురు ఫైర్

సావిత్రికి చాలా మందితో సంబంధాలు.. అందులో మా నాన్న ఒకరు.. జెమినీ కూతురు ఫైర్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Gemini Ganesan Daughter Comments On Savitri

  మహానటి చిత్రం రిలీజైన తర్వాత సావిత్రి వ్యక్తిగత జీవితం, జెమినీ గణేషన్‌తో వైవాహిక జీవితం, ఇతర అంశాలు మరోసారి మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నాయి. దక్షిణాది ప్రేక్షకుల ఆరాధ్య నటి సావిత్రి జీవితానికి సంబంధించిన విషయాలపై పలువురు ఆసక్తికరంగా చర్చించారు. అయితే వెండితెరపైన వెలిగిపోయిన సావిత్రి.. వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మహానటి చిత్రంలో సావిత్రి జీవితాన్ని అద్భుతంగా చూపించారని, మిగితా వ్యక్తులను అవమానించేలా చిత్రీకరించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి భర్త జెమినీ గణేషన్ మొదటి భార్య కూతురు కమలా సెల్వరాజ్ మీడియాకు వెల్లడించిన సంచలన విషయాలు చర్చనీయాంశమయ్యాయి.

  ప్రతిష్ఠకు భంగం కలిగించేలా

  ప్రతిష్ఠకు భంగం కలిగించేలా

  మహానటి చిత్రంలో తన తండ్రి జెమినీ గణేషన్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా పాత్రను చిత్రీకరించారని కమలా సెల్వరాజ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నా తండ్రిని ఫ్లాప్ హీరోగా చిత్రీకరించారు. అదే సమయంలో సావిత్రిని సక్సెస్‌ఫుల్ నటిగా చూపించారు. ఇది వాస్తవాలకు విరుద్ధం అని ఆమె అన్నారు.

  మా నాన్న టాప్ హీరో

  మా నాన్న టాప్ హీరో

  తమిళంలో నా తండ్రి జెమినీ గణేషన్ టాప్ యాక్టర్. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్‌కు స్థాయిలో క్రేజ్ ఉంది. ఆయన సినీ రంగంలో ఆయన అగ్ర నటుడే అని కమలా సెల్వరాజ్ పేర్కొన్నారు. అలాంటి ప్రతిష్ఠ కలిగిన వ్యక్తి జీవితాన్ని చాలా తక్కువ చేసి చూపించారనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

  మా నాన్న తప్పు కాదు

  మా నాన్న తప్పు కాదు

  సావిత్రిని తన తండ్రి మద్యానికి బానిస చేయలేదు. ఆమెనే తాగుడుకు బానిస అయ్యారు అని కమలా వెల్లడించారు. సావిత్రి జీవితానికి సంబంధించిన ఒకే కోణాన్ని తెర మీద అద్భుతంగా చూపించారు. మరో కోణాన్ని పట్టించుకోలేదు. అది చాలా దారుణం అని ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు.

   మా నాన్నతో దారుణంగా

  మా నాన్నతో దారుణంగా

  సావిత్రి కూడా తన తండ్రితో చాలా దారుణంగా ప్రవర్తించారు. 1971లో ప్రాప్తం చిత్రాన్ని సావిత్రి నిర్మించి, దర్శకత్వం వహించే సమయంలో మా నాన్న ఆమెను చూడటానికి వెళ్లారు. ఆ సమయంలో మా నాన్నను ఇంటి నుంచి బయటకు పంపించడానికి కుక్కలను పైకి వదిలారు అని కమల సెల్వరాజ్ వివరించారు.

  మా నాన్న ఫ్లాఫ్ హీరోగా

  మా నాన్న ఫ్లాఫ్ హీరోగా

  సావిత్రికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. అందులో మానాన్న ఒకరు అని కమలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానటి చిత్రం రూపొందించే క్రమంలో చిత్ర యూనిట్ సరిగా పరిశోధన చేయలేదు. మా నాన్న ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్నట్టు చూపించడం దారుణం, అవకాశాలు లేకుండా సావిత్రి వెంట షూటింగులకు తిరిగారనే విధంగా జెమినీ గణేషన్‌ పాత్రను మలిచారు అని అన్నారు.

  సావిత్రి అంటే చెప్పలేనంత ప్రేమ

  సావిత్రి అంటే చెప్పలేనంత ప్రేమ

  సావిత్రి తాగుడుకు బానిస కావడానికి కారణం మా నాన్న కాదు. సావిత్రి అంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. అందుకే ఆమె ప్రతిష్ఠకు భంగం కలుగకుండా చర్యలు తీసుకొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో రక్షణగా ఉండేందుకు ఆయన చాలా ప్రయత్నించారు అని కమలా సెల్వరాజ్ తెలిపారు.

  మా అమ్మ సమర్ధించలేదు

  మా అమ్మ సమర్ధించలేదు

  మా నాన్న జెమినీ గణేషన్‌కు మహిళంటే చాలా గౌరవం. ఆయన ఫెమినిస్టు భావాలు కలవారు. సావిత్రి ప్రతిష్టను చూసి ఏనాడు అసూయ చెందలేదు. మహిళలు స్వతంత్ర భావాలతో ఉండాలని ప్రోత్సాహించేవారు. నా తల్లి అలిమేలు, సావిత్రి, మా నాన్న కలిసి ఉన్న సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. సావిత్రి, జెమినీ పెళ్లిని మా అమ్మ ఎన్నడూ సమర్ధించలేదు అని ఓ ప్రశ్నకు కమలా వివరణ ఇచ్చారు.

  English summary
  Gemini Ganesan's daughter Kamala Selvaraj seems to be unhappy over Mahanati movie. “Savitri had multiple relationships, and one of them was with Gemini,” said Kamala. She has also accused the team of ‘not researching enough’. “My father didn’t influence Savitri to become an alcoholic. He did the best to give her dignity and protection, because he loved her truly. Also, Gemini Ganesan was a top actor, who was on par with MG Ramachandran and Sivaji Ganesan. But in the film, he is shown to be jobless and hanging around the sets of Savitri’s films all the time. There’s no mention of his fan-following in the film.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more