»   » పోలీస్ ల పై కంప్లైంట్ చేసిన కమలినీ ముఖర్జీ!

పోలీస్ ల పై కంప్లైంట్ చేసిన కమలినీ ముఖర్జీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాదారణంగా సమాజంలో కుళ్ళు, కుతంత్రాలు, దగ పడ్డవారి పై పోలిసులకి కంప్లయింట్ ఇస్తాము అయితే పోలిసులపైనే కంప్లయింట్ ఏంటనుకుంటున్నారా? కమలిని కంప్లయింట్ చేసింది రియల్ పోలిసుల మీద కాదు. తాను నటించిన 'పోలీస్ పోలీస్" సినిమా నిర్మాతల మీద!. అసలు విషయం ఏటంటే 'పోలిస్ పోలీస్" చిత్రం ఆర్ధిక ఇబ్బందుల కారణంచేత సినిమా రిలీజ్ కాకుండా బాక్సుల్లోనే ఉండిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కమలినికి సదరు చిత్ర నిర్మాతలు చందు, మన్ మోహన్ దాదాపు ఆరు లక్షల రూపాయలు బాకీ ఉన్నారట. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆమె బ్యాలెన్స్ ఇచ్చేస్తామనుకొనే లోపే సినిమా రిలీజ్ అవుతోందని తెలిసి ఆమె దగ్గరున్న పోస్ట్ డేటడ్ చెక్కులను బ్యాంక్ లో ప్రెజెంట్ చేసింది. అవి కాస్త బౌన్స్ అయ్యాయి.

అంతే నిర్మాతల మండలిని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని సంప్రదించి తన గోడు వెళ్లబోసుకుంది. సదరు నిర్మాతలను వివరణ కోరుతూ ఆర్డర్లు జారీ అయ్యాయి మరి ఈ వివాదం వల్ల ఏప్రిల్ 9న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమా విడుదల సవ్యంగా జరుగుతుందా? సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వివాదం సద్దుమణిగితేనే సినిమా విడుదలవుతుంది. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది ఈ చిత్రం ప్రదర్శన హక్కుల్ని సొంతం చేసుకున్న నట్టికుమార్ చక్రం తిప్పాడు. 'పోలీస్ పోలీస్" సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకాలుండకూడదని, రాజశేఖర్ తో తాను నిర్మిస్తోన్న 'మా అన్నయ్య బంగారం" సినిమాలో కమలినికి హీరోయిన్ గా అవకాశమిచ్చాడు.

కమిలినికి డబ్బులు ఎగ్గొట్టాలనే ఆలోచన తమకు లేదని, ఆమెకు పేమెంట్ ఇవ్వడానికి సిధ్దంగానే ఉన్నామని, అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆలస్యం జరిగిందని, కానీ ఈ లోగా ఆమె కావలని చెక్ బౌన్స్ చేసిందని నిర్మాతలు వాపోతున్నారు. అయితే కొత్త నిర్మాతలకు, చిన్న నిర్మాతలకు చుక్కలు చూపిండంలో తెలుగు చిత్ర పరిశ్రమ పెట్టింది పేరు. ఇలాంటి అనుభవాలతోనే చాలా మంది నిర్మాతలు అంధకారంలోకి వెళ్లిపోవడమో, ఆత్మ కథలు రాసుకోవడమో చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu