»   »  18 ఏళ్ల తర్వాత తెలుగులో వస్తున్న ‘కామసూత్ర’ (ఫోటోస్)

18 ఏళ్ల తర్వాత తెలుగులో వస్తున్న ‘కామసూత్ర’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 18 ఏళ్ల క్రితం అంటే 1996లో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించిన ‘కామసూత్ర-ది టేల్ ఆఫ్ లవ్' చిత్రాన్ని తాజాగా తెలుగులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘మీరా నాయర్‌ ఫిలింస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌' పతాకంపై మీరా నాయర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో రుషి పిక్చర్స్‌ అధినేత బలరాం శర్మ విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉన్నారంటూ అప్పట్లో సెన్సార్ బోర్డు ఈ చిత్రంపై నిషేదం విధించింది. పలు రాజకీయ పార్టీలు, మత సంస్థలు ఆందోళన చేసాయి. అయితే మీరా నాయర్ సుప్రీం కోర్టుకు వెళ్లి... కొన్ని కట్స్ అనంతరం ఈ సినిమాను విడుదల చేసారు.

యుక్త వయసుకు వచ్చిన స్త్రీ`పురుషులకు.. తిండి-నిద్ర తర్వాత ‘కామం' కూడా అంతే ముఖ్యం. అరవై నాలుగు కళల్లోనూ అత్యంత ముఖ్యమైన కళ ‘కామకళ'. వాత్సాయన మహర్షి రాసిన ‘కామసూత్ర గ్రంధం' ఆధారంగా దానికి కొంత కాల్పనికత జోడించి ‘కామసూత్ర' పేరుతోనే మీరా నాయర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

తారాగణం

తారాగణం


ఈ చిత్రంలో నవీన్‌ అండ్రూస్‌, ఇందిరావర్మ, రామోన్‌ తికారం, సరితా చౌదరి, హరీష్‌ పటేల్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ఏ టేల్‌ ఆఫ్‌ లవ్‌' అన్నది ట్యాగ్‌లైన్‌.

కాన్సెప్టు

కాన్సెప్టు


తార అనే రాణి, మాయ అనే రాజదాసి, రాజసింహ అనే రాజు మధ్య ఏర్పడిన ప్రేమ, కామం, మోహం, ఈర్ష్య, ద్వేషం వంటి భావోద్వేగాల తాలూకు పర్యవసానాల సమ్మేళనంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్


త్వరలోనే తెలుగు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

వర్కౌట్ అవుతుందా?

వర్కౌట్ అవుతుందా?


దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెరకెక్కిన సినిమా అయినప్పటికీ ఇలాంటి సినిమాలు తెలుగులో రాలేదు కాబట్టి మంచి ఆదరణ పొందుతాయని ఆశిస్తున్నారు.

English summary
Made in 1996, Oscar nominated Indian director Mira Nair's take on ancient Indian erotic science, Kamasutra: A tale of love, was banned initially by the censor board. The film, which was completely true to the ancient historic text written by Vatsayana, was in wrong news those days for its realistic and explicit depiction of sex.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu