Just In
- 3 min ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
- 42 min ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 58 min ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
- 2 hrs ago
టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!
Don't Miss!
- Sports
చెలరిగిన ఠాకూర్.. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్!! ఆధిక్యం 276!
- News
ఎన్టీఆర్ ఇంకా కళ్లముందే కదలాడుతున్నట్టుంది: చంద్రబాబు: ఘాట్ వద్ద బాలకృష్ణ, లక్ష్మీపార్వతి నివాళి
- Finance
బంగారం ధరలు ఈ వారం ఎలా ఉండవచ్చు, మరింత తగ్గే అవకాశముందా?
- Automobiles
ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?
- Lifestyle
ఈ ఆరోగ్యకరమైన ఆమ్లెట్లను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చచ్చిపోతే ఎవరు బాద్యులు.. ప్రియదర్శికి హార్ట్ ఎటాక్ తెప్పించిన తమ్ముడు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్ గా క్రేజ్ అందుకుంటున్న వారిలో ప్రియదర్శి ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకొని ఆ తరువాత కమెడియన్ గానే కాకుండా పలు రకాల సపోర్టింగ్ రోల్స్ తో కూడా మెప్పిస్తున్నాడు. ఇక మనోడికి సోషల్ మీడియాలో కూడా క్రేజ్ గట్టిగానే ఉంది. మల్లేశం సినిమా లేటుగా చూసిన వారు కూడా ప్రియదర్శి నటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇటీవల ఒక నెటిజన్ కామెంట్ కు ప్రియదర్శికి హార్ట్ ఎటాక్ వచ్చిందట.

ఆ సినిమాకు ఇంకా ప్రశంసలు అందుతూనే ఉన్నాయి
ప్రియదర్శి సినిమాలు చేసినా అలాగే వెబ్ సిరీస్ లు చేసినా కూడా రెస్పాన్స్ మామూలుగా రావడం లేదు. మల్లేశం సినిమా నెట్ ఫ్లిక్స్ లో గత ఏడాది మంచి వ్యూవ్స్ ను అందుకుంది. ఇప్పటికి ఆ సినిమాపై పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. ప్రియదర్శి కూడా సోషల్ మీడియాలో ప్రతి నెటిజన్ కామెంట్ కు థాంక్స్ చెబుతున్నాడు.

కంబాలపల్లి కథలు..
అయితే ప్రస్తుతం ప్రియదర్శి మరోక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆహా యాప్ లో స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న కంబాలపల్లి కథలు అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. గ్రామాల్లోకి మొదటిసారి కంప్యూటర్ మెయిల్స్ వంటివి వచ్చినప్పడు ఆ వాతావరణాన్ని ఇందులో చూపించబోతున్నారు.

పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ చేస్తాం
చాప్టర్ 1 మెయిల్.. టీజర్ కు అలాగే ట్రైలర్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేయడం ప్రియదర్శిని కూడా ఎట్రాక్ట్ చేసింది. అన్నా నీ పైన వైజాగ్ పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ చేస్తాం. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు బాద్యులు? అంటూ డిఫరెంట్ గా ట్వీట్ చేస్తూ మెయిల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కామెంట్ చేశారు.

హార్ట్ ఎటాక్ వచ్చింది తమ్ముడు..
ఇక ఆ నెటిజన్ కామెంట్ కు ప్రియదర్శి కూడా పాజిటివ్ గా స్పందించాడు. అబ్బా.. ఫస్ట్ లైన్ తో హార్ట్ ఎటాక్ వచ్చింది తమ్ముడు.. అందరికి చాలా థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియదర్శికి పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి కూడా ఈ మధ్య ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతున్నట్లు కామెంట్స్ ను చూస్తేనే అర్ధమవుతోంది.