»   »  పవన్ కళ్యాణ్ తో కమ్ముల సినిమా?

పవన్ కళ్యాణ్ తో కమ్ముల సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆయన తొలి సినిమా డాలర్ డ్రీమ్స్..ఆ తరువాత ఆనంద్, గోదావరి..తాజాగా హాపీడేస్. ఆయన ఏ సినిమా తీసినా సంచలనమే. శాంతంగా ఉంటూ సంచలన విజయాలు సాధించడం శేఖర్ కమ్ముల సక్సెస్ సీక్రెట్. హాపీడేస్ సినిమా చాపకింద నీరులా అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. కాలేజీ విద్యార్థులు బంక్ కొట్టి సినిమాకు వెళ్లివచ్చిన తరువాత బంక్ కొట్టకుండా ఉండాల్సిందనుకుంటున్నారు. ఇలా ప్రభావాన్ని చూపుతున్న సినిమాను తీసిన కమ్ముల సినిమాపై ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం వైజాగ్ వెళ్లిన కమ్ముల అక్కడ మీడియాతో మాట్లాడారు. సినిమా పరిశ్రమలో తనకు బాగా నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తాను తీసే సినిమాలకు చక్కగా స్యూట్ అవుతుందని అసలు విషయం చెప్పాడు. ఆనంద్ సినిమా పవన్ కళ్యాణ్ తో తీసుండాల్సింది. ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ చక్కగా స్యూట్ అయ్యేదని మనసులో మాట చెప్పాడు. త్వరలో పవన్ తో సినిమాను ఎక్స్ పెక్ట్ చేయవచ్చా శేఖర్ కమ్ముల గారూ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X