»   » ‘కాంచన’ రైట్స్ కొన్న సంజయ్ లీలా భన్సాలీ

‘కాంచన’ రైట్స్ కొన్న సంజయ్ లీలా భన్సాలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఇటీవల పలు తెలుగు హిట్ చిత్రాల రైట్స్ తీసుకుని వాటిని హిందీలో రీమేక్ చేసే ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ లాలా భన్సాలీ తెలుగు కామోడీ హారర్ మూవీ 'కాంచన' హిందీ రీమేక్ రైట్స్ కొన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగులో లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటించారు. హిందీ వెర్షన్‌కు కూడా లారెన్సే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే హీరోగా ప్రముఖ బాలీవుడ్ హీరోను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట భన్సాలీ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం లారెన్స్....కాంచన చిత్రానికి సీక్వెల్‌గా ముని-3 చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఈచిత్రం కూడా లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈచిత్రంలో లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్‌గా ఎంపికయింది. గత సంవత్సరమే ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

శ్రీ గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మల్టీ డైమన్షనల్ అధినేత రజిత్ పార్థసారథి సమర్పణలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 'కాంచన' సినిమా సమయంలోనే తన బ్యానర్ లో ఓ సినిమా చేసిపెడతానని లారెన్స్ తనకి మాట ఇచ్చారనీ, దానిని ఇప్పుడిలా నిలబెట్టుకున్నారని చెప్పారు. 'కాంచన' సినిమా తనకి మంచి లాభాలు తెచ్చి పెట్టిందనీ, అలాగే ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకముందని అన్నారు.

దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ.... ఈ చిత్రం కాంచన తరహాలోనే ఎంటర్‌టైన్ చేస్తుందని, ఓ వైపు నవ్విస్తూనే... భయపెడుతుందని చెప్పుకొచ్చారు. లారెన్స్, తాప్సీ, బ్రహ్మానందం, శ్రీమాన్, అలీ, కోవై సరళ నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: కృష్ణ స్వామి, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Telugu comedy horror film Kanchana written, acted in and directed by Raghava Lawrence will now be made in Hindi. Popular Bollywood director Sanjay Leela Bhansali has brought the rights of this comedy horror film. Sources inform us that Kanchana in Hindi will be directed by Raghava Lawrence himself.
Please Wait while comments are loading...