»   » షాకింగ్: వరుణ్ తేజ్ ‘కంచె’ బడ్జెట్ ఎంతో తెలుసా?

షాకింగ్: వరుణ్ తేజ్ ‘కంచె’ బడ్జెట్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కంచె'. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాపుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలై ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ స్టన్నింగ్ గా ఉందని మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం మెచ్చుకున్నారు.

1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్దం బ్యాక్ డ్రాప్ కావడంతో అప్పటి కాలానికి అనుగుణంగా సెట్టింగులు, కాస్ట్యూమ్స్, ఆయుధాలు ఇలా అన్నంటి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. తాజాగా ఓ ఇంగ్లిష్ లీడింగ్ డైలాతో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ఈ సినిమాకు ఎంత బడ్జెట్ ఖర్చయిందనే విషయాలు వెల్లడించారు.


సినిమా మొత్తం రూ. 21 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలిపారు. వరుణ్ తేజ్ లాంటి హీరోకు ఇంత బడ్జెట్ భారీ మొత్తం అనే చెప్పాలి. అయితే మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కావడంతో పెట్టిన పెట్టుబడి ఈజీగా తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు. ట్రైలర్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో భారీగా ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.


'Kanche' Budget Revealed

ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరూ చిత్రీకరించని రెండవ ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ‘కంచె' చిత్రానికి స్పెషల్ హైలైట్ గా నిలుస్తాయి. జార్జియా దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , యుద్ధ ట్యాంక్స్ , యూనిఫాం, లొకేషన్స్‌ను వాడుకుని, భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
The director of ‘Kanche’ movie Krish, himself, revealed to a leading English daily that the makers spent a whopping sum of Rs.21 crores on this highly expected project.
Please Wait while comments are loading...