»   » కంగ్రాట్స్ :అటు ‘బాహుబలి’,ఇటు‘కంచె’

కంగ్రాట్స్ :అటు ‘బాహుబలి’,ఇటు‘కంచె’

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిల్లీ: 63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కంచె' ఎంపికైంది. క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌, ప్రజ్ఞాజైశ్వాల్‌ ప్రధాన పాత్రల్లో ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై 'కంచె' చిత్రం తెరకెక్కింది.

అలాగే ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. పురస్కారాల జాబితాను జ్యూరీ సభ్యులు సోమవారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అందజేశారు.


ఉత్తమ నటుడు: అమితాబ్‌బచ్చన్‌(పీకూ)
ఉత్తమ నటి: కంగనా రనౌత్‌( తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌)
ఉత్తమ దర్శకుడు: సంజయ్‌లీలా బన్సాలీ(బాజీరావ్‌ మస్తానీ)


Kanche Gets Best Regional Telugu Film Award

బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ ముచ్చటగా మూడోసారి జాతీయ పురస్కారాన్ని అందుకోబోతోంది. 2009లో వచ్చిన ఫ్యాషన్‌ చిత్రానికి సహాయ నటిగా కంగనా తొలి జాతీయ పురస్కారాన్ని అందుకుంది.


ఆ తర్వాత గత ఏడాది 'క్వీన్‌'గా పేరు, ప్రశంసలతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. తను వెడ్స్‌ మను చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చిత్రానికి గాను ఇప్పుడు మరోసారి జాతీయ ఉత్తమనటి పురస్కారం అందుకుంది.

English summary
Director Krish's Kanche, starring Varun Tej and Pragya Jaiswal bagged the prestigious National Award in the category, best regional Telugu film at 63rd National Awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu