»   » దసరా బరిలో ‘కంచె’: రామ్ చరణ్ -వరుణ్ తేజ్ మధ్య పోటీ!

దసరా బరిలో ‘కంచె’: రామ్ చరణ్ -వరుణ్ తేజ్ మధ్య పోటీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘అఖిల్' చిత్రం దసరా బరి నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో అక్టోబర్ 22న వరుణ్ తేజ్ సినిమా ‘కంచె' విడుదలవుతోంది. ఈ మేరకు ఈ విషయాన్ని వరుణ్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా వెల్లడించారు. వాస్తవానికి అక్టోబర్ 2నే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలతో వాయిదా పడింది.

మరో వైపు ‘కంచె' మూవీ ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ పూర్తయిందటే సినిమా షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అఖిల్ సినిమా దసరాకి విడుదలయి ఉంటే కంచెను నవంబర్ మొదటి వారంలో విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఉన్నట్టుండి అఖిల్ దసరా బరి నుండి తప్పుకోవడంతో ‘కంచె' చిత్రాన్ని అక్టోబర్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమా ఈ రోజు విడుదలైంది. కేవలం వారం గ్యాపుతో ‘కంచె' విడుదలవుతుండటం గమనార్హం. మరి అన్నయ్య రామ్ చరణ్ కు వరుణ్ తేజ్ బాక్సాఫీసు వద్ద ఎలా పోటీ ఇస్తాడో చూడాలి.


Kanche is all set to entertain you this Dusshera

తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ‘కంచె'. ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది.


'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా 'కంచె'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి..విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ని ముమ్మరం చేసారు. అందులో భాగంగా...కంచె మేకింగ్ డైరీ అంటూ విడుదల చేస్తున్నారు.

English summary
Kanche is all set to entertain you this Dusshera. October 22nd release.
Please Wait while comments are loading...