»   » క్రిష్ పనితీరుకు అద్దం పట్టే ‘కంచె’ (వర్కింగ్ స్టిల్స్)

క్రిష్ పనితీరుకు అద్దం పట్టే ‘కంచె’ (వర్కింగ్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్దురుమ్ చిత్రాలతో కమర్షియల్ పోకడలకు భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు క్రిష్. తాజాగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కంచె'. గతంలో తెలుగులో ఎన్నడూ రాని ఓ సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ఇది.

ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘కంచె' మూవీ ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ మరింత బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, స్టిల్స్ కు మంచి స్పందన వచ్చింది.


కంచె సినిమా షూటింగ్ 55 రోజుల్లో కంప్లీట్ చేసాంరు. ఇండియాలో సగం షూటింగ్ పూర్తి చేసి, జార్జియా లో సుమారు ముప్పై రోజులు పైనే షూటింగ్ నిర్వహించారు. జార్జియాలో రోజుకు ఇరవై నుండి ముప్పై లక్షల బడ్జెట్ ఖర్చు పెట్టారు. వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.


స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్....


దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ...

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ...

1944 లో జరిగిన యుద్ధంలో సుమారుగా అన్ని దేశాలు పాల్గొన్నాయి. మనకు స్వతంత్రం రావడానికి కూడా రెండో ప్రపంచయుద్ధం ఒక కారణం. అందుకే దానిని వివరంగా చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాం అన్నారు.


అలా పుట్టింది

అలా పుట్టింది

జపాన్ దేశం సైనికులు అండమాన్ నికోబార్ దగ్గరగా వెళ్లి బాంబు వేసారు. అక్కడ కొండప్రాంతాల్లో దాని చర్యలు కనిపిస్తాయి. వైజాగ్ లో షిప్ మీద కూడా బాంబు వేయాలని ప్రయత్నించారు కాని అది వేరే చోట పడింది. వారు వెళ్ళిపోతూ వైజాగ్ లో ఓ డ్యామ్ వొదిలేసి వెళ్ళారు. నేను వేదం షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ డ్యామ్ చూసాను. అక్కడ నుండే కంచె సినిమా చేయాలనే ఆలోచన పుట్టింది అని చెప్పుకొచ్చారు క్రిష్.


సైనికుడి ప్రేమకథ

సైనికుడి ప్రేమకథ

రెండో ప్రపంచ యుద్దం జరిగి సుమారుగా 75 సంవత్సరాలు అయింది. 25 లక్షల భారతీయ సైనికులు ఇందులో పోరాడారు. ప్రతి ఒక్కరికి ఒక చాప్టర్ ఉంటుంది. ఆ ఇరవై ఐదు లక్షల్లో ఒకరి కథను బ్యాక్ డ్రాప్ గా తీసుకొని సినిమా చేసాను. అన్నారు క్రిష్.


వరుణ్ తేజ్ తో

వరుణ్ తేజ్ తో

వరుణ్ కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది. కంచె ఓ సైనికుడి ప్రేమకథ. 1940 లో జరిగే కథ కాబట్టి హీరో అలానే కనిపించాలి.


నటన అద్భుతం

నటన అద్భుతం

అప్పట్లో 18,19 సంవత్సరాల పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా కనిపించే వారు. ఇప్పుడైతే ఇంకా చిన్నపిల్లల్లానే కనిపిస్తారు. 1936 లో మద్రాసు పట్నంలో చదువుకునే కుర్రాడి పాత్రలో, 1944 లో జరిగే యుద్ధంలో భారతీయ సైనికుని పాత్రలో వరుణ్ చూపించిన వేరియేషన్స్ మరెవరు చూపించలేరు. అంత అధ్బుతంగా నటించాడు. అన్నారు.


ప్రేమ

ప్రేమ

మనుషుల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, యాసలు ఇలా ప్రతి దాంట్లో వేరు చేసి చూస్తున్నారు. ఎంత వేరు చేసినా ప్రేమ మాత్రం తగ్గదు. సీత అనే సంపన్న కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి అదే ఊర్లో ఉండే మరో అబ్బాయిని చెన్నైలోని కలుసుకుంటుంది. వారి పరిచయం ప్రేమగా మారుతుంది. వారి ప్రేమ వలనే కంచె ఏర్పడుతుంది. వాటివల్ల అందరు కొట్టుకునే స్థాయికి చేరుతారు అంటూ సినిమా లైన్ చెప్పారు క్రిష్.


ఇండియాలోనే సరికొత్త కథ

ఇండియాలోనే సరికొత్త కథ

ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు చూడని సినిమా మేము చేస్తున్నాం. అన్ని జోనర్స్ లో సినిమాలు వచ్చాయి. కాని ఈ ఒక్క జోనర్ లో సినిమా రాలేదు. అందుకే రాజీవ్ బాగా ఖర్చు పెట్టారు అన్నారు.


కొత్తదనం

కొత్తదనం

ఎన్ని జోనర్స్ ఉన్నా.. ఒకే రకమైన కథలపై పరుగులు పెడుతున్నారు. కథలను, జీవితాలను సినిమాగా ఎందుకు చేయలేకపోతున్నారో తెలియట్లేదు. రెగ్యులర్ గా ఉండే కథలు నన్ను ఎగ్జైట్ చెయ్యట్లేదు. ఈగ సినిమా చూసాక ఎంత బావుందీ చిత్రం అనిపించింది. మణిరత్నం గారు ముందు నాకోసం సినిమా తీసుకుంటాను.. తరువాత ప్రేక్షకులకు చూపిస్తానని.. చెబుతుంటారు. అందుకే ముందు నన్ను తృప్తి పరిచేలా సినిమా తీస్తాను. కంచె ఓ పీరియాడిక్ ఫిలిం. వార్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ ప్రేమకథ.


కంచె

కంచె

వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.


దసరా కానుక

దసరా కానుక

ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నారు.


English summary
Kanche is a 2015 Telugu war drama film directed by Krish starring Varun Tej and Pragya Jaiswal in lead roles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu