»   » వరుణ్ తేజ్ ‘కంచె’ సెన్సార్ రిపోర్ట్

వరుణ్ తేజ్ ‘కంచె’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కంచె'.తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా చాలా బావుందని, యునిక్ కంటెంటుతో ఇంప్రెసివ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సినిమాను తెరరెక్కించారని సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసలు గుప్పించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.


Kanche's censor report

ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ..సైనికుడుగా కనిపించనున్నాడు. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. వరుణ్ తేజలోని నటుణ్ణి క్రిష్ 'కంచె' చిత్రంలో వెలికి తెచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు... ఈ సినిమాతో వరుణ్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనీ చెబుతున్నారు.


ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది. కంచె చిత్రంలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు.

English summary
As per the latest update, Kanche movie censor formalities have been completed with a U/A certificate.
Please Wait while comments are loading...