»   » పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్లానింగులో... ‘కంచె’

పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్లానింగులో... ‘కంచె’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. ఇటీవల విడుదలైన కంచె ఫస్ట్, లుక్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. రెండో ప్రపంచ యుద్దం నాటి సన్నివేశాలు టీజర్లో చూసి అంతా స్టన్నయ్యారు.

తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు వెల్ కం చెబుతు సెప్టెంబర్ 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రైలర్ విడుదల చేస్తారని తెలుస్తోంది.


ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరూ చిత్రీకరించని రెండవ ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ‘కంచె' చిత్రానికి స్పెషల్ హైలైట్ గా నిలుస్తాయి. జార్జియా దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , యుద్ధ ట్యాంక్స్ , యూనిఫాం, లొకేషన్స్‌ను వాడుకుని, భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


Kanche trailer on Pawan’s birthday

ఈ చిత్రం టీజర్ ను ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా చిత్ర బృందం విడుదల చేసింది. సుమారు 45 సెకండ్ల రన్ టైం ఉన్న ఈ టీజర్ కు సోషల్ మీడియా లో అద్భుతమైన స్పందన వచ్చింది. మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ కూడా పెద్ద స్టార్ గా ఎదుగుతాడని అంతా అంటున్నారు.


బాలీవుడ్ లో ఇటివలే ‘గబ్బర్' చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

English summary
Theatrical of Varun Tej’s Kanche will be launched on the night of 1st September welcoming the birthday of Power Star Pawan Kalyan.
Please Wait while comments are loading...