»   » ఆయనకు వెటకారం ఎక్కువ.. డైరెక్టర్ ఎప్పుడో అవ్వాలి.. రాజమౌళి

ఆయనకు వెటకారం ఎక్కువ.. డైరెక్టర్ ఎప్పుడో అవ్వాలి.. రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కజిన్, రచయిత కాంచీ ప్రతీ ఒక్కరిలోనూ తప్పులు చూపిస్తుంటారని సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. కాంచీ దర్శకత్వంలో 'షో టైమ్‌' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పూదోట నిర్మించిన జాన్‌ సుధీర్‌ ఈ చిత్రానికి నిర్మాత.
రణధీర్‌, రుక్సార్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌.కీరవాణి సంగీతం సమకూర్చారు.

Kanchi is very sarcastic said SS Rajamouli on Show Time Audio

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి మాట్లాడుతూ.. 'మేము తొమ్మిది మంది కజిన్స్. అందులో కాంచీ ఒకడు. కాంచన్న చాలా వెటకారంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక వెటకారం ఉంటుంది. వాస్తవానికి ఆయన ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి కానీ చాలా ఆలస్యం అయింది' అని అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తప్పులు ఉండకూడదని కోరుకుంటున్నానని అన్నారు.

సినిమా ట్రైలర్ అద్బుతంగా ఉంది. టీజర్ ను చూసిన ప్రతి వాళ్లు సినిమా చూడాలనుకుంటారన్నారు. కీరవాణి అందించిన సంగీతం అలరిస్తుందని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని తెలిపారు.

English summary
Sensational director SS Rajamouli made serious comments on his cousin Kanchi. He said very sarcastic. Kanchi is become director for Show Time movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu