»   » అతనొక చేతకాని వాడు: మీడియా ముందే హీరో గాలి తీసేసిన కంగనా

అతనొక చేతకాని వాడు: మీడియా ముందే హీరో గాలి తీసేసిన కంగనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ వ్యక్తిగతంగా.. వృత్తి పరరంగా ఏమి మాట్లాడినా... ఏమి చేసినా సంచలనమే.... గత కొన్ని రోజులుగా హృతిక్ రోషన్ తో ఓ వైపు గొడవ పడుతుంటే... మరో వైపు మాజీ ప్రేమికుడు అధ్యయన్ సుమన్ చేస్తున్న ఆరోపణలు కంగనా గురించి అందరూ వ్యాఖ్యానించే దిశగా పయనించాయి.దేశవ్యాప్తంగా మీడియాలో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.

Also Read: నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదు: హీరోయిన్ సంచలన కామెంట్

ఐతే అధ్యయన్ ఒక ఫెయిల్యూర్ హీరో కావడం. అతడు ఇండస్ట్రీలోనే కనిపించకుండా అయిపోవడంతో అతడి మాటలని పిచ్చ లైట్ తీసుకున్నారు అంతా. అయినప్పటికీ ఈ ఆరోపణల మీద కంగనా కూడా ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆశించారు మరికొందరు వచ్చిన ఆరోపనలమీద స్పందించకుండా వదిలేస్తే ఒప్పుకున్నట్టే కదా అని వారివాదనట... ఇప్పుడు వాళ్ల కోరికను కూడా కంగనా తీర్చేసింది.

Kangana answers to Adhyayan suman

"ఔను నేను కొండప్రాంతం నుంచి వచ్చినదాన్నే.జంగ్లీ పిల్లనే.., కానీ మరీ చేతబడులు చేసేదానిలా కనిపిస్తున్నానా..? ఆ హీరో చెప్పగానే నమ్మేస్తారా? ఇది మరీ ధారుణం నేను మనుషులని ఆకర్షిస్తాను కానీ మంత్రాలతో కాదు అది నాకళ్ళతో చేసే మ్యాజిక్ మాత్రమే. నిజమే అప్పుడు అతను నా మాయలో పడిపోయాడు.

నేను పూజలు, చేతబడులు చేశానని అంటున్నారుగా? మరి ఆ విషయం నా చుట్టుపక్కల ఉండే కొందరికైనా తెలిసే అవకాశం ఉంటుందిగా? అలాంటివి చేస్తే వాళ్లంతా ఊరుకుంటారా? ఇప్పటికే గ్రామాల్లో ఇలాంటి నమ్మకాలతో నే ఎంతం,అంది మీద దాడులు జరుగుతున్నాయో చూదటం లేదా...

Kangana answers to Adhyayan suman

ఇంత చిన్న విషయం కూడా ఆ హీరోగారికి తట్టలేదెందుకో నాకు అర్థం కాలేదు" అంది కంగనా. తన సినిమాలు ఫ్లాపవవ్వడానికి మీరు చేసిన చేతబడులే కారణమని అధ్యయన్ అంటున్నాడుగా అని కంగన వద్ద ప్రస్తావిస్తే." ఇంతకంటే తమాషా ఇంకేమైనా ఉంటుందా? ఆయన సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నా యంటే లోపం ఆయన నటనలో ఉండాలి.. ఆ కథల్లో ఉండాలి.

వాటిని కప్పిపుచ్చుకోవడానికి నేనేదో పూజలు చేశా ననీ, అందుకే తన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయని కట్టుకథలు చెప్పడం ఎందుకు? " అంటూ అధ్యయన్ సుమన్ ని డైరెక్ట్ గానే చేతకాని వాడు అంటూ తేల్చి పడేసింది.

English summary
Bollywood Actress Kangana Ranaut answers to Adhyayan suman on his "black magic" accusation...
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu