Just In
- 16 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 25 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లైవ్‌లోనే రెచ్చిపోయిన కంగనా రనౌత్.. షాకై నోరెళ్లబెట్టిన సినీ ప్రియులు
కంగనా రనౌత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి ఆమె చేసిన సినిమాలతో పాటు, తలెత్తిన వివాదాలూ కారణమే. కంగనా ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా వివాదంలో దూరకుండా ఉండదు. అందుకే ఈమె దేశం మొత్తానికి యాక్టర్‌గా కంటే వివాదాస్పద సెలెబ్రిటీగా బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఇప్పటికే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది.

జర్నలిస్టుతో గొడవ
ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలోని సాంగ్ లాంచింగ్ కార్యక్రమంలో కంగనా రెచ్చిపోయింది. తన గత చిత్రం ‘మణికర్ణిక.. ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమా రివ్యూ విషయంలో ఓ జర్నలిస్టుతో మాట్లాడే సమయంలో కంగనా విచక్షణ కోల్పోయింది. సదరు జర్నలిస్టుపై విరుచుకుపడిన ఆమె.. ‘‘మణికర్ణిక మేకింగ్ విషయంలో నేనేమైనా తప్పు చేశానా..? జాతీయత గురించి సినిమా తీసిన నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా..?'' అంటూ అతడిపై ప్రశ్నల వర్షం కురిపించింది.
|
ధీటైన సమాధానమిచ్చిన జర్నలిస్టు
కంగనా తనపై విరుచుకుపడుతుండడంతో సదరు జర్నలిస్టు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. తనపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యమైనవి కావంటూనే.. ఆగ్రహంతో ఊగిపోయాడు. వీరిద్దరి ధాటికి అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ గొడవ పడుతుండడం చూసి అంతా నోరెళ్లబెట్టేశారు. చివరికి ఫంక్షన్‌లో ఉన్న కొందరు ఇద్దరినీ సముదాయించడంతో గొడవ ముగిసింది.

వివాదాలు కొత్తేం కాదు
కంగనా రనౌత్‌కు వివాదాలు కొత్తేం కాదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ సెలెబ్రిటీలపై కామెంట్లు చేయడం ఆమె అలవాటుగా మారింది. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌తో చెలరేగిన వివాదం మరువక ముందే ఆమె ఎన్నో సార్లు వార్తల్లోకి ఎక్కింది. అంతేనా.. ఆమె గత చిత్రం విషయంలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా డైరెక్టర్‌నే అయినా తనకు క్రెడిట్ ఇవ్వలేదని క్రిష్ ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది.

‘జడ్జిమెంటల్ హై క్యా' గురించి...
ప్రస్తుతం కంగనా చేస్తున్న చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా'. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి తెరకెక్కించారు. మొదటి ఈ సినిమాకు ‘మెంటల్ హై క్యా' అని టైటిల్ పెట్టారు. అయితే, దీనిపై సైక్రియార్టిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టైటిల్ మార్చడంతో పాటు ట్రైలర్‌ను సైతం వాయిదా వేశారు. ఏక్తా కపూర్, శ్రద్ధా కపూర్, శైలేష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కంగనాతో పాటు రాజ్‌కుమార్ రావు, విక్రాంత్ తదితరులు నటిస్తున్నారు.