»   » నాదగ్గర డిస్కౌట్లుండవు, ఫెయిల్యూర్ని క్యాష్ చేసుకోలేరు :కంగన

నాదగ్గర డిస్కౌట్లుండవు, ఫెయిల్యూర్ని క్యాష్ చేసుకోలేరు :కంగన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హాట్ క్వీన్ కంగనా రనౌత్. వెండితెరపై తన అందాలను ఆరబోయడంలోనే కాదు ఎలాంటి స్టేట్మెంట్ అయినా ఇవ్వడంలో బోల్డ్‌గానే ఉంటుంది.ఈ మధ్య ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లోకెక్కుతోంది. ఆమె ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతోంది. 'నేను మామూలుగానే మాట్లాడుతున్నా.. నా మాటల్లో వివాదాల్ని వెతుకుతున్నారు.. వాటితో నన్ను వివాదాల్లోకి లాగుతున్నారు..' అంటూ కంగనా తనదైన స్టయిల్లో ఈ వ్యవహారంపై కవర్ చేసుకోవాలని కూడా చూస్తోంది.

ఒక్కసారి కమిట్‌ అయ్యాక

ఒక్కసారి కమిట్‌ అయ్యాక

సినిమా హిట్టయినా, ఫ్లాపయినా కంగనా రనౌత్‌ ఒకేలా వుంటుందట. కథ ఓకే చేసేటప్పుడే, అందులోని పాత్ర గురించి ఆలోచిస్తాననీ, ఒక్కసారి కమిట్‌ అయ్యాక దాని గురించి మళ్ళీ ఆలోచించడం జరగదనీ, సినిమా హిట్టయితే ఉప్పొంగిపోవడం, ఫ్లాపయితే బాధపడటం అనేవి తన విషయంలో జరగనే జరగవని తేల్చి చెప్పింది కంగనా రనౌత్‌.

నిద్ర, శృంగారం.. రెండూ

నిద్ర, శృంగారం.. రెండూ

నిద్ర, శృంగారం ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే కోరుకోమంటే.. తాను శృంగారానికే ఓటేస్తానని చెప్పింది. అయినా నిద్ర, శృంగారం.. రెండూ వేర్వేరు కాదు అంటూ బోల్డ్ గా ధైర్యంగా మాట్లాడే కంగనా ఎప్పుడూ ఏ విషయం లోనూ తగ్గదు. కిందపడ్డా తాను ఓటమిని ఒప్పుకునే రకం కాదు అందుకే ఎన్ని వివాదాల్లో ఉన్నా తాను మాత్రం ధైర్యంగానే ఉంటుంది

రీసెంట్ గా మరోసారి

రీసెంట్ గా మరోసారి

'ఎవరన్నా నన్ను విమర్శిస్తే ఊరుకోలేను.. నా మీద కామెంట్లు వేస్తే వెంటనే కోపమొచ్చేస్తుంది.. కౌంటర్ ఇచ్చాకనే హ్యాపీగా వుంటుంది..' అంటోన్న కంగనా, తనలాంటివారు చాలా అరుదుగా వుంటారనీ, తానెప్పుడూ 'వన్‌ అండ్‌ ఓన్లీ..' అనుకుంటానని గతం లోనే చెప్పిన కంగన రీసెంట్ గా మరోసారి జనం మీద విరుచుకు పడింది.

ఫెయిల్యూర్‌ను సొమ్ము చేసుకోవాలని

ఫెయిల్యూర్‌ను సొమ్ము చేసుకోవాలని

‘‘నా ఫెయిల్యూర్‌ను సొమ్ము చేసుకోవాలని జనాలు అనుకుంటున్నారు. ఫ్లాపుల్లో ఉందికదా కంగనా ఇప్పుడు రెమ్యూనరేషన్లో డిస్కౌంట్ ఇస్తుందనుకుంటున్నారు. కొందరు నా దగ్గరికి వచ్చి ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్లకు ఒకటే సమాధానం చెప్పా.

ఆర్టిస్టుగా నా పనికి విలువ ఇవ్వాలి

ఆర్టిస్టుగా నా పనికి విలువ ఇవ్వాలి

కాంట్రాక్టులో ఇలాంటి విషయాల గురించి ప్రస్తావన లేదు కదా అని. ఒక ఆర్టిస్టుగా నా పనికి విలువ ఇవ్వాలి. నేను మీకు ఇన్ని డేట్లు ఇస్తున్నపుడు నా పని గంటలకు.. ఒక పాత్రను పోషించడంలో నా ప్రతిభకు డబ్బులివ్వాలి. కాబట్టి ఫెయిల్యూర్లను బట్టి డిస్కౌంట్లు ఉండవు'' అని కుండబద్దలు కొట్టేసింది కంగనా.

English summary
"Some people want to take advantage of my failure. They are thinking that Kangana will give them discount in her remuneration. my skill in playing certain role. So, flops don't lead to discounts". says Kangana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu