twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    106 మంది త్యాగాల ఫలితం ముంబై.. కంగనపై శివసేన ఫైర్.. క్వీన్‌కు కేంద్రం Y సెక్యూరిటీ!

    |

    బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు Y క్యాటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. కొద్ది రోజులుగా మహారాష్ట్ర సర్కారు, శివసేన నాయకులకు, కంగనకు మధ్య వాడివేడిగా మాటల యుద్దం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. కొద్ది రోజులుగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌, కంగనకు మధ్య సోషల్ మీడియా, మీడియాలో వాగ్వాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 9వ తేదీన ముంబైకి వస్తున్నానంటూ సంజయ్ రౌత్‌కు కంగన సవాల్ విసిరారు. ఈ వివాదంలో అసలేం జరిగిందంటే..

    Recommended Video

    Sushant Singh Rajput : Netizens Change Their Mind On Shraddha Kapoor And Kriti Sanon
    ముంబై కమిషనర్‌పై కంగన ఆగ్రహంతో వివాదం

    ముంబై కమిషనర్‌పై కంగన ఆగ్రహంతో వివాదం

    ముంబై పోలీసు కమిషనర్‌ వ్యవహారశైలిని తప్పుపడుతూ కంగన రౌనత్ మండిపడ్డారు. తనపై అనుచిత వ్యాఖ్యలు, ట్రోలింగ్ చేస్తున్న వారి ట్వీట్లను లైక్ చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దుష్టశక్తులకు అండగా నిలుస్తుంటే.. ముంబైలో నా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వీలైతే నేను హిమాచల్ ప్రదేశ్ లేదా కేంద్ర ప్రభుత్వ రక్షణ కోరుతానని చెప్పారు. దీంతో శివసేన, కంగన మధ్య వివాదం మొదలైంది.

    ముంబై పాక్ ఆక్రమిత కశ్మీరా?

    ముంబై పాక్ ఆక్రమిత కశ్మీరా?

    కంగన వ్యాఖ్యల నేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మహారాష్ట్ర ప్రధానంగా ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్, తాలిబాన్ అంటూ పోల్చడంపై శివసేన నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఓ దశలో కంగనను హరామ్‌కోర్ లడ్కీ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై కోసం 106 మంది ప్రాణ త్యాగం చేశారు. అలాంటి మహారాష్ట్ర ప్రజలను కంగన కించపరిచే విధంగా మాట్లాడింది అంటూ ఘాటుగా స్పందించారు.

    కంగనకు ముంబైలో ఉండే హక్కు లేదని

    కంగనకు ముంబైలో ఉండే హక్కు లేదని

    ఇదిలా ఉండగా ముంబై పోలీసులను మాఫియాతో పోల్చడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని నేతలు సూచించారు. ఈ క్రమంలో ముంబైకి రాకుండా అడ్డుకోవాలని శివసేన నేతలు సిద్దమయ్యారు. ముంబైలో జీవించే హక్కు కంగనకు లేదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాటల కౌంటర్, ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

     మీ అయ్య జాగీరా అంటూ కంగన ఫైర్

    మీ అయ్య జాగీరా అంటూ కంగన ఫైర్

    శివసేన నేతల దాడికి కంగన రనౌత్ ధీటుగా స్పందించింది. ముంబై మీ అయ్య జాగీరా? ఎవడి అయ్యకైనా దమ్ముంటే ఆపండి. నేను సెప్టెంబర్ 9న ముంబైకి వస్తున్నాను అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం కంగనకు వై సెక్యూరిటీ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నది.

    Y క్యాటగిరి సెక్యూరిటీ అంటే...

    Y క్యాటగిరి సెక్యూరిటీ అంటే...

    సాధారణంగా ప్రాణాలకు ముప్పు ఉండే రాజకీయ, ఇతర ప్రముఖులకు X, Y, Z క్యాటగిరీల భద్రతను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత Y క్యాటగిరి భద్రత విషయానికి వస్తే... 11 మందితో కూడిన భద్రత ఉంటుంది. ఇందులో ఇద్దరు కమెండోస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉండే అవకాశాన్ని కల్పిస్తారు. అయితే ఒక వ్యక్తికి ఇలా భద్రతను కల్పించడం ద్వారా ఏడాదికి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు పతనం అవుతున్న సమయంలో ఇలాంటి భద్రత వారికి అవసరమా అనే వాదన సోషల్ మీడియాలో వినిపిసత్ున్నది.

    English summary
    Bollywood actress Kangana Ranaut has given Y category security by Centre amid Shiva Sena leaders threat. Kangana visiting Mumbai on September 9th. Since lockdown, she has been in her home town Manali of Himachal pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X