»   » ఆ హీరోయిన్‌కు పిచ్చి పట్టింది... అందుకే అలా వాగుతోంది, లీగల్‌ చర్యలు!

ఆ హీరోయిన్‌కు పిచ్చి పట్టింది... అందుకే అలా వాగుతోంది, లీగల్‌ చర్యలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... నటుడు ఆదిత్య పంచోలి మీద సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో మైనర్ గా ఉన్న తనను అతడు తీవ్రంగా హింసించాడని, రక్తం వచ్చేలా కొట్టాడని ఆరోపించారు.

కంగనా రనౌత్ వ్యాఖ్యలపై ఆదిత్య పంచోలి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కంగనాకు పిచ్చి పట్టిందని, అందుకే అలా మాట్లాడుతోందని మండి పడ్డారు. కంగన విషయాన్ని ఊరికే వదిలి పెట్టను, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఆదిత్య పంచోలి తెలిపారు.

నా గురించి ఇలా ఇదే తొలిసారి

నా గురించి ఇలా ఇదే తొలిసారి

ఇండస్ట్రీలో నేను ఎన్నో ఏళ్లుగా ఉన్నాను, నా గురించి ఒక వ్యక్తి ఇంత దారుణంగా, క్రూరంగా మాట్లాడటం ఇదే తొలిసారి. ఆమె ఇంటర్వ్యూ చూస్తే పిచ్చిది మాట్లాడినట్లే ఉంది. అయినా బురదలో రాళ్లు వేస్తే మన దుస్తులకే మరకలు అంటుతాయి అని కంగనాను ఉద్దేశించి ఆదిత్య పంచోలి కామెంట్ చేశారు.

కంగనా కామెంట్స్ ఇవే...

కంగనా కామెంట్స్ ఇవే...

‘ఆదిత్య పంచోలి నా తండ్రి వయసు వ్యక్తి. ఆయన కూతురు కంటే చిన్నదాన్ని. నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చాను. అతడితో కలిసి పని చేస్తున్న సమయంలో తీవ్రంగా హింసించేవాడు, నన్ను ఓసారి తలపై రక్తం వచ్చేలా కొట్టాడు... అని కంగనా రనౌత్ వెల్లడించింది. 'ది టౌన్ హాల్ విత్ బర్కా దత్' అనే కార్యక్రమంలో పాల్గొన్న కంగనా ఆదిత్య పంచోలీ మీద ఈ కామెంట్స్ చేసింది.

అతడి భార్యకు చెప్పినా కూడా...

అతడి భార్యకు చెప్పినా కూడా...

ఆదిత్య పంచోలి తనను తీవ్రంగా హింసిస్తుండటంతో ఆయన భార్య జరీనా వాహబ్‌ను ఆశ్రయించాను. కానీ ఆమె నుండి సహాయం అందలేదు. ఆదిత్య ఇంటికి రావడంలేదు. అతడు రాక పోవడంతో తాను చాలా హాయిగా ఉన్నట్లు ఆమె తనతో చెప్పిందని కంగనా వెల్లడించారు.

పోలీసులకు చెబుదామంటే..

పోలీసులకు చెబుదామంటే..

ఆదిత్య పంచోలి గురించి పోలీసులకు కంప్లైంట్ చేద్దామనుకున్నాను. పోలీస్ స్టేషన్ వరకు విషయం వెలితే విషయం తమ ఇంటికి చేరుతుందని.... అలా జరిగితే వారు మళ్లీ నన్ను ఇంటికి తీసుకెళతారు అని భయపడ్డట్లు కంగనా తెలిపారు.

చర్యలు తీసుకోలేదు

చర్యలు తీసుకోలేదు

అయితే దైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాను. అయితే పోలీసులు అతడిని పిలిచి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టారు. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని కంగనా రనౌత్ వెల్లడించారు.

English summary
In her recent interviews, Bollywod actor Kangana Ranaut attacked celebrities like Aditya Pancholi, Hrithik Roshan and Adhyayan Suman. She went on record to say that Pancholi abused her and kept under house arrest for days when she was a struggling actor. Now, Aditya Pancholi has said that he will take legal action against Ranaut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu