»   » దర్శకుడి సెక్సువల్ వేధింపుల ఇష్యూ : హీరోయిన్ కంగన స్పందన!

దర్శకుడి సెక్సువల్ వేధింపుల ఇష్యూ : హీరోయిన్ కంగన స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్లలో చాలా బోల్డ్ గా, ఏ విషయం అయినా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే హీరోయిన్‌గా కంగనా రనౌత్‌కు పేరుంది. ఇండస్ట్రీలో హీరోయిన్లపై సెక్స్ వేధింపులు నిజమే, అవకాశాల కోసం ఇలాంటి చేస్తారు అంటూ పలు సందర్భాల్లో కంగనా నిర్మొహమాటంగా చెప్పిన సంగతి తెలిసిందే.

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి జాతీయ అవార్డు దక్కించుకున్న మూవీ 'క్వీన్'. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వికాష్ బెమల్ మీద సెక్సువల్ వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఓ ఫ్యాషన్ ఈవెంటుకు హాజరైన కంగనకు ఇందుకు సంబంధించిన అంశంపై స్పందించాల్సిందిగా మీడియా నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి.

కంగనా రనౌత్ స్పందిస్తూ....

కంగనా రనౌత్ స్పందిస్తూ....

ఇక్కడ మనం ఓ బ్రాండ్ గురించి మాట్లాడటానికి వచ్చాం. కానీ మీరు ఓ సీరియస్ టాపిక్ గురించి మాట్లాడమంటున్నారు. ఎవరైనా సరే అలాంటి సంఘటన(సెక్సువల్ వేధింపులు) ఎదుర్కొంటే భయపడకుండా నిర్మొహమాటంగా మాట్లాడాలి అని కంగనా రనౌత్ అన్నారు.

ఎంకరేజ్ చేయాలి

ఎంకరేజ్ చేయాలి

మహిళలు సెక్సువల్ వేధింపులు ఎదుర్కొన్నపుడు.... ప్యామిలీ, ఫ్రెండ్స్ వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. దానికి గురించి ఎక్కడైనా, ఎవరి ముందైనా ధైర్యంగా చెప్పగలిగేలా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి అని కంగనా రనౌత్ అన్నారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనందుకు సిగ్గుపడకూడదు... ఇలాంటి చర్యలకు పాల్పడ్డవారే చిగ్గు పడేలా చేయాలి అని కంగనా తేల్చి చెప్పారు.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

బాలీవుడ్లో ‘చిల్లర్ పార్టీ', ‘క్వీన్' లాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్ బెహల్ మీద సెక్సువల్ వేధింపుల ఆరోపణల రావడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. అయితే వికాస్ మాత్రం తనకు ఏ పాపం తెలియదు అంటున్నారు. అయితే ఇది కేవలం ఆరోపణలతోనే ఆగిపోలేదు... అతడిపై అతడిపై కేసు పెట్టే వరకు వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో అతడి సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు చిత్రీకరణ నిలిపి వేసాయి.

కేసు పెట్టిన యువతి

కేసు పెట్టిన యువతి

బాలీవుడ్ కి చెందిన ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి తనతో వికాస్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కేసు పెట్టింది. కొన్ని నెలల క్రితం వికాస్‌ ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం గోవా వెళ్లారు. అక్కడ తన పట్ల వికాస్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ యువతి ఆరోపణ.

నాకు ఏ పాపం తెలియదు అంటున్న దర్శకుడు

నాకు ఏ పాపం తెలియదు అంటున్న దర్శకుడు

కేసు ముంబైలో నమోదు కాగా.... వికాస్ బెహల్ ఢిల్లీలో ఉన్నారు. ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ఆమె అసలు మా(ఫాంటమ్ ఫిల్మ్స్) ఉద్యోగిని కాదు అని దర్శకుడు తెలిపారు.

క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమే

క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమే

నాపై ఫిర్యాదు చేసిన యువతితో కలిసి గతంలో కొన్ని సినిమాల్లో పని చేసారు. ఒకవేళ నేను తనతో అసభ్యకరంగా ప్రవర్తించి ఉంటే తనతోనేరుగా వచ్చి కూర్చుని మాట్లాడతాను. మీ ముందే ఆమెని నిజనిజాలు అడుగుతాను. ఒకవేళ ఆమె విషయంలో తప్పు జరిగింది అనుకుంటే క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమే అని వికాస్ మీడియాకు తెలిపారు.

ఫాంటమ్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుల్లో వికాస్ ఒకరు

ఫాంటమ్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుల్లో వికాస్ ఒకరు

ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ సంస్థ 2011 ప్రారంభం అయింది. దర్శకులు అనురాగ్‌ కశ్యప్‌, విక్రమాదిత్య మోత్వానే, మధు మంతెన, వికాస్‌ బెహల్‌ కలిసి ఈ సంస్థను ప్రారంభించారు.

వికాస్ ను సంస్థ నుండి తొలగించారా?

వికాస్ ను సంస్థ నుండి తొలగించారా?

కాగా గోవాలో చిత్రీకరణజరుగుతున్న సమయంలో యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ చిత్రీకరణ నిలిపి వేసింది. సంస్థ నుండి కూడా వికాస్ ను తొలగించినట్లు పేర్కొంది. అయితే వికాస్ మాత్రం తాను పాంటమ్ ఫిల్మ్స్ లో ఇంకా పని చేస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
Last week, the news of Vikas Bahl being accused of sexual harassment by a female employee left everyone shocked. At a recent event, Kangana Ranaut who had been directed by Bahl in the award-winning film Queen, reacted to this episode.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu