»   » నా మాజీ లవర్స్ మళ్లీ నావద్దకు.. అదే నా రికార్డు.. కంగన

నా మాజీ లవర్స్ మళ్లీ నావద్దకు.. అదే నా రికార్డు.. కంగన

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దుమారం సృష్టించడంలో బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా మీడియా చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ ప్రియులందరూ మళ్లీ తన దగ్గరికి రావాలనుకొంటున్నారని, అదే తనకున్న ఘనత అని ఆమె పేర్కొన్నది.

ఒకరితో సంబంధం పెట్టుకొంటే వారితో..

ఒకరితో సంబంధం పెట్టుకొంటే వారితో..

‘నేను ఎవరితోనైనా సంబంధం పెట్టుకొన్నప్పుడు వారితో పూర్తిగా మునిగిపోతాను. ఒకవేళ ఆ రిలేషన్ బిడిసికొడితే మళ్లీ వారి ముఖం చూడను. మళ్లీ నా మాజీ ప్రియులను కలుసుకున్న దాఖలాలు లేవు. వారి ముఖం చూసిన సందర్భాలు లేవు' అని కంగన తెలిపింది.

నా మాజీలు మళ్లీ నా వద్దకు

నా మాజీలు మళ్లీ నా వద్దకు

‘ఈ మధ్యకాలంలో నా మాజీ ప్రియులందరూ మళ్లీ నాతో జీవితాన్ని కొనసాగించాలని కోరుకొంటున్నారు. అలాంటి ప్రతిపాదనలు నా జీవితంలో రికార్డుల్లాంటివి. అందుకు కారణం నా ప్రవర్తన, ఒకరిపట్ల చూపించే ప్రేమ అని ఆమె అన్నారు.

ప్రతీ ఒక్కరిపై ప్రేమను కురిపిస్తాను..

ప్రతీ ఒక్కరిపై ప్రేమను కురిపిస్తాను..

‘ప్రతి రిలేషన్‌లోనూ స్వచ్ఛమైన ప్రేమను కురిపిస్తాను. నా సంబంధాలు అలా ఉంటాయి. నా ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి. నా చేతిలో ఏమి ఉండవు. ఎలా జరిగితే అలా స్వాగతించడమే నా ముందు ఉన్న పని' అని కంగన అన్నారు.

24న రంగూన్‌తో ముందుకు

24న రంగూన్‌తో ముందుకు

ప్రస్తుతం దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న రంగూన్ చిత్రంలో కంగనా రనౌత్ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నది. ఆమె పక్కన షాహిద్ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదలకు సిద్ధమవుతున్నది.

English summary
Kangana said, “When I am in a relationship. I am really into it. but when it’s over, I never look back. All my ex partners want to get back with me, that’s also a record I hold
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu