Don't Miss!
- Finance
markets: ఈ ఏడాది ఇండియన్ కంపెనీలు ఇంత సమీకరించాయా ? కానీ గతేడాదితో పోలిస్తే..!!
- News
Budget 2023: తినబోతూ రుచులెందుకు..!!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
రీమేక్ చేసి,చెడకొట్టద్దు..వదిలేయండి
హైదరాబాద్ : మ్యాజిక్ ఒకసారే జరుగుతుంది. అలాగే ఒక చిత్రం ఒక భాషలో అన్ని కుదరి చక్కటి హిట్ అవుతుంది. ఆవేశంగా దాన్ని రీమేక్ చేయాలని ప్రయత్నిస్తే బోర్లా పడటం జరుగుతుంది. తాజాగా అందాల అంగన కంగన రనౌత్ నటించిన 'క్వీన్' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీయనున్నట్టు సమాచారం. ఈ విషయం విన్న క్వీన్ చిత్రం అభిమానులు...రీమేక్ చేయటం అంటే చెడకొట్టడమే అంటున్నారు. అంతగా దాన్ని తెలుగు ప్రేక్షకులుకు అందచేయాలంటే డబ్బింగ్ చేయండి...కంగనా ఇక్కడ కూడా తెలుసు కాబట్టి కొంతలో కొంత బెస్ట్ అంటున్నారు.

ఒంటరిగా హానీమూన్‌కి బయల్దేరిన భామ కథగా దర్శకుడు వికాశ్ బాల్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్లతో పాటు, ప్రశంసలను కూడా సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 'తెలుగు, తమిళ భాషల్లో తీస్తే మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతుంది. నిజానికి ప్రపంచంలో ప్రతి చోట ఒక రాణి ఉంది. అందుకే ఈ సినిమా అందరినీ ఆకర్షించింది. అందుకే రీమేక్స్‌కి అనుమతి ఇచ్చాను' అంటున్నారు దర్శకుడు. ఇంతకీ తెలుగులో 'రాణి' ఎవరో వేచి చూడాలి.
ఇక రీసెంట్ గా శేఖర్ కమ్ముల...కహానీ చిత్రం తీసుకు వచ్చి అనామిక అంటూ తెలుగులోకి దించారు. అక్కడ ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇక్కడ పెద్ద ఫ్లాఫ్ గా భాక్సాఫీస్ వద్ద నమోదు అయ్యింది. అక్కడికి మీడియా ఈ చిత్రం గురించి చాలా పాజిటివ్ గా ప్రచారం చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు కనపడటం లేదు. ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్టునే ఇక్కడ చూడలేదు. క్వీన్ లాంటి భావోద్వేగభరితమైన చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎవరు చూస్తారు.. అంటున్నారు. అందులోనూ మనకు హీరోయిన్ ఓరియెండెట్ చిత్రాలు పెద్దగా నడవటం లేదు. గతంలో హీరోయిన్ ఓరియెంటెడ్ గా వచ్చి హిట్టైన చిత్రాలు అరుంధతి, మంత్ర వంటి హర్రర్ లు,అనుకోకుండా ఒక రోజు వంటి థ్రిల్లర్ లు కావటం విశేషం.