»   » నువ్వు మహిళా లోకానికే మాయని మచ్చవి: సింగర్ ని ఇలా అనేసింది

నువ్వు మహిళా లోకానికే మాయని మచ్చవి: సింగర్ ని ఇలా అనేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్నట్టే ఉండి ఒక్క సారి పాత పగలని తిరగ దోడింది మిస్ కాంట్రవర్సీ ఆఫ్ బాలీవుడ్ కంగనా రనౌత్. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి పై ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదిత్య పంచోలి, హృతిక్ రోషన్‌లపై తనకున్న వైరం గురించి ప్రస్తావించింది. ఆదిత్య పంచోలి తనను చిన్నప్పుడు దారుణం కొట్టేవాడని కంగనా కామెంట్స్ చేసింది. దీనిపై పంచోలి ఆమెపై కేసు పెట్టనున్నట్లు తెలిపారు.

కంగనా స్పందించింది

కంగనా స్పందించింది

అలాగే హృతిక్ రోషన్, కంగనా కొద్దికాలం ప్రేమలో ఉండి ఆ తర్వాత విడిపోయారు. దీనిపై కూడా కంగనా స్పందించింది. మా ఇద్దరి ప్రేమ వ్యవహారంలో కూడా ఆదిత్య.. హృతిక్‌కే మద్దతు పలకడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్‌లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

సింగర్ సోనా మహాపాత్ర

సింగర్ సోనా మహాపాత్ర

ఈ నేపథ్యంలో కంగనా చేసిన ఆరోపణలు బాలీవుడ్‌‌లో పెద్ద చర్చను లేవదీశాయి. ఈ క్రమంలో సింగర్ సోనా మహాపాత్ర కంగనా రనౌత్‌కు బహిరంగ లేఖ రాసింది.‘సిమ్రన్‌' సినిమా ప్రచార కార్యక్రమాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావంటూ ఆ లేఖలో కంగనాపై సోనా మండిపడింది.

రంగోలీ

రంగోలీ

ఇది సరికాదని సూచించింది. దీనిని కంగనా పట్టించుకోలేదు కానీ, ఆమె సోదరి రంగోలీ ట్విటర్‌ వేదికగా సోనాపై ధ్వజమెత్తింది. ‘ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు దాన్ని సర్కస్‌ అంటూ వ్యాఖ్యానించకు. మనుషుల జీవితాలు వారి ప్రయాణాలు, సినిమాలపై ఆధారపడి ఉండవు.

తీవ్రస్థాయిలో ఆగ్రహం

తీవ్రస్థాయిలో ఆగ్రహం

నువ్వు మహిళా లోకానికే మాయని మచ్చవి. నీలాంటి వాళ్లు పబ్లిసిటీ కోసం ఇలాంటి విషయాలపై స్పందిస్తుంటారు' అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సోషల్ మీడియాలో సానుకూల, ప్రతికూల స్పందనలు వినిపిస్తున్నాయి. మొత్తాని "సిమ్రన్" సినిమా పబ్లిసిటీ కోసమే కంగనా ఆ పని చేసి ఉంటే ఆ లక్ష్యం చక్కగా నెరవేరినట్టే

English summary
Kangana’s sister Rangoli who is active on social media slammed the singer Sona Mohapatra for Her Open letter to Kangana Ranauth
Please Wait while comments are loading...