»   » అఫైర్లతో విసిగిపోయాను.. ఈ ఏడాదే పెళ్లి.. కారణం అతడే.. కంగన

అఫైర్లతో విసిగిపోయాను.. ఈ ఏడాదే పెళ్లి.. కారణం అతడే.. కంగన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ 'క్వీన్' కంగన రనౌత్ ఎవరికీ భయపడకుండా ఎప్పుడూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ మీడియాను ఉరుకులు, పరుగులు పెట్టిస్తుంటుంది. అదే స్సీడ్‌లో ఇటీవల తన పెళ్లి, ప్రేమ వ్యవహారంపై పలు విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం తాను ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఈ ఏడాదే పెండ్లి చేసుకొంటానని ఆమె తెలిపారు. అఫైర్లు, రూమర్లతో విసిగిపోయానన్నారు.

పెండ్లంటే పారిపోయే దాన్ని కాను

పెండ్లంటే పారిపోయే దాన్ని కాను

‘ఔనన్నా, కాదన్నా పెండ్లికి ఓ సమయం అంటూ ఉంటుంది. పెండ్లి అంటే సిగ్గుపడి పారిపోయే వయసు నాది కాదు. రిలేషన్‌షిప్‌ గురించి గానీ, పెండ్లి గురించి గాని దాచేది ఏమిలేదు' అని కంగన తెలిపింది. ఇంతకుముందు పెండ్లి గురించి సరైన అవగాహన లేదని, ఇప్పుడే జీవితంలో దాని విలువ తెలుస్తున్నదని ఆమె చెప్పింది.

30 ఏండ్లలో పెండ్లిపై స్పష్టత వచ్చింది..

30 ఏండ్లలో పెండ్లిపై స్పష్టత వచ్చింది..

ఇరువై ఏండ్ల ప్రారంభంలో తాను స్వేచ్ఛగా బతుకాలనే ఉద్దేశం ఉండేదని, 30 ఏండ్లకు చేరువవుతున్న సమయంలో పెండ్లి గురించి ఆలోచన పెరిగిందని కంగన తెలిపారు. ఇదే విషయాన్ని తన తల్లి కూడా చెప్పేదని, అప్పుడు తనకు అర్థం కాలేదని పేర్కొన్నారు.

సినీ హీరోలతో అఫైర్లు

సినీ హీరోలతో అఫైర్లు

బాలీవుడ్ క్వీన్ అనేక మంది హీరోలతో రిలేషన్స్ ఉన్నట్టు మీడియాలో రూమర్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. తొలుత యువ హీరో సూరజ్ పంచోలి తండ్రి ఆదిత్య పంచోలితో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రాజ్ సినిమాలోని సహనటుడి అధ్యాయన్ సుమన్‌తో అఫైర్ ఉన్నట్టు రూమర్ వచ్చింది. ఇటీవల హ‌ృతిక్ రోషన్‌తో వ్యవహారం మీడియాలో రచ్చగా మారింది. హృతిక్‌ను చిల్లర మాజీ ప్రియుడు అని వ్యాఖ్యలు చేసింది.

షాహీద్ కపూర్ ప్రధాన కారణం

షాహీద్ కపూర్ ప్రధాన కారణం

పెళ్లిపై ఓ స్పష్టమైన అవగాహన కలుగడానికి బాలీవుడ్ స్టార్ షాహీద్ కపూర్ కారణమని కంగన తెలిపింది. అతను చాలా ఎక్కువగా ప్రోత్సాహించాడు. ‘నేను అమితంగా ప్రేమించే వ్యక్తి ఉన్నప్పుడు, అదే వ్యక్తి నన్ను కూడా అంతే మొత్తంలో ప్రేమిస్తున్నపుడు ఎందుకు దూరంగా ఉండాలి' అనే భావన ఏర్పడింది. ఇలాంటి భావన ఏర్పడటానికి షాహీద్ కపూర్ ప్రధాన కారణమన్నారు.

ప్రేమ పెళ్లా.. పెద్దల పెళ్లా ..

ప్రేమ పెళ్లా.. పెద్దల పెళ్లా ..

అయితే తన పెళ్లి పెద్దలు కుదిర్చినదా లేదా మరోకటా అనేది ఇప్పుడే చెప్పలేనని కంగన రౌనత్ అన్నారు. జీవితంలో ఎప్పుడూ ఏమి జరుగుతుందో చెప్పడం కష్టమని ఆమె అన్నారు.

English summary
Bollywood Queen Kangana Ranaut recently stunned everyone in the film industry when she announced that she might get married this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu