»   » ట్యూబ్ లైట్ కోసం శ్రీదేవి, టివి పగలగొట్టాలనుకున్న కంగన..శ్రీదేవి కోరిక!

ట్యూబ్ లైట్ కోసం శ్రీదేవి, టివి పగలగొట్టాలనుకున్న కంగన..శ్రీదేవి కోరిక!

Subscribe to Filmibeat Telugu

ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ మరియు విద్యాబాలన్ వంటి స్టార్లే శ్రీదేవి మృతి పట్ల ఎంతటి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారో తెలిసిందే. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ ని ప్రభావితం చేసిన వారిలో శ్రీదేవి కూడా ఉన్నాయని ప్రియాంక తెలిపింది. ఎందరో వర్ధమాన హీరోయిన్లకు శ్రీదేవి ఆదర్శం. కాగా మరో సంచలన తార కంగనా రనౌత్ కు శ్రీదేవి అంటే పిచ్చి. కంగనా చిన్న తన నుంచే శ్రీదేవికి అభిమాని. శ్రీదేవి మరణ వార్త విన్న తరువాత షాక్ తో కంగనా అనారోగ్యానికి గురైంది. ఎట్టకేలకు తేరుకుని ఇటీవల బోనీ కుటుంబాన్ని పరామర్శించింది. ఓ ఇంటర్వ్యూలో కంగనా శ్రీదేవిపై ఉన్న పిచ్చి అభిమానాన్ని బయట పెట్టింది.

శ్రీదేవి ముఖాన్నిచూసి టీవీ కట్టేశాను....
శ్రీదేవి కోసం అభిమానులే కాదు

శ్రీదేవి కోసం అభిమానులే కాదు

శ్రీదేవిపై కేవలం సినీఅభిమానులకే అభిమానం కాదు.. అందాల హీరోయిన్లు కూడా అతిలోక సుందరి అంటే పడి చస్తారు.

ప్రియాంక చోప్రా కూడా

ప్రియాంక చోప్రా కూడా

ప్రియాంక వంటి అంతర్జాతీయ ఫేమ్ ఉన్న నటి కూడా శ్రీదేవి పట్ల వల్లమాలిన అభిమానాన్ని చూపిస్తుంది. తన కెరీర్ ని ప్రభావితం చేసిన వారిలో, ఆదర్శంగా నిలిచినా వారిలో శ్రీదేవి కూడా ఒకరని పీసీ తెలిపిన సంగతి తెలిసిందే.

సంచలన బ్యూటీకి చిన్నప్పటి నుంచే

సంచలన బ్యూటీకి చిన్నప్పటి నుంచే

సంచలన తార కంగనా రనౌత్ కు కూడా శ్రీదేవి అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచే తాను శ్రీదేవిని చిన్నప్పటినుంచే అభిమానించేదానినని కంగనా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఆ డ్రెస్ వేసుకుంటే

ఆ డ్రెస్ వేసుకుంటే

చిన్న తనంలో స్కూల్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఓ డ్రెస్ వేసుకున్నా. ఆ డ్రెస్ లో నన్ను మా గ్రాండ్ గ్రాండ్ మదర్ చూసి శ్రీదేవిలా ఉన్నావని తెలిపింది. అలాంటి మధుర జ్ఞాపకాలని మరచిపోలేదని కంగనా రనౌత్ తెలిపింది.

ట్యూబ్ లైట్ యాడ్ లో

ట్యూబ్ లైట్ యాడ్ లో

శ్రీదేవి బాలీవుడ్ లో పెద్ద సార్ అయ్యాక ఆమె పలు యాడ్ లలో కూడా కనిపించేది. పలు కంపెనీల బ్రాండ్ లకు ప్రచారం కల్పించేది. ఓ సారి శ్రీదేవి ట్యూబ్ లైట్ యాడ్ లో కనిపించింది. ఆమెని ఎలాగైనా తన ఇంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించా. టివి అద్దం పగలగొట్టి అందులోనుంచి శ్రీదేవిని బయటకు తీయాలని ప్రయత్నించినట్లు కంగనా సరదాగా వ్యాఖ్యానించింది.

కంగానని శ్రీదేవి కోరిన కోరిక

కంగానని శ్రీదేవి కోరిన కోరిక

కంగనా రనౌత్ బాలీవుడ్ ఓ స్టార్ అయ్యాక శ్రీదేవితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఓ సందర్భంలో తాను జాన్వీతో కలసి ఓ చిత్రంలో నటించాలని తనని శ్రీదేవి కోరినట్లు కంగనా తెలిపింది.

శ్రీదేవి మృతితో అనారోగ్యం

శ్రీదేవి మృతితో అనారోగ్యం

శ్రీదేవి మృతితో షాక్ కి గురైన కంగనా అనారోగ్యానికి గురైంది. కోలుకుని ఇటీవలే బోని కపూర్ కుటుంబాన్ని కలసి శ్రీదేవి మృతికి తన సంతాపాన్ని తెలియజేసింది.

English summary
Kangana Ranaut wanted to break the television screen for Sridevi. She is crazy about Sridevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu