»   » నా నుంచి దూరంగా పారిపో...! హృతిక్ కోసం కంగనా చెప్పిన కథ ఇదే

నా నుంచి దూరంగా పారిపో...! హృతిక్ కోసం కంగనా చెప్పిన కథ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో ప్రేమలు, ప్రణయాలు, వాటి చుట్టూ వదంతులు కొత్త కాదు. బాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌-హృతిక్‌రోషన్‌ల ప్రేమకథ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. కానీ బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్‌, కంగనా రనౌత్‌ మధ్య 'ఎఫైర్‌' మాత్రం రచ్చకెక్కి హల్‌చల్‌ చేసింది పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకునేదాకా వెళ్ళింది.

అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలకు తండ్రైన హృతిక్‌ను ప్రేమించిన కంగన ఈ ప్రేమకథతో తన పరువు పోగొట్టుకుంది. పోలీస్‌ కేసులు ఎదుర్కొంది, కోర్టు మెట్లు కూడా ఎక్కింది. అయినా ఇప్పటివరకు ఆ లవ్‌స్టోరీ గురించి మీడియాతో మాట్లాడని కంగన.. ఓ అవార్డుల ఫంక్షన్‌లో ఈ వ్యవహారం గురించి నోరు విప్పింది. హృతిక్‌ పేరును ప్రస్తావించకుండానే తన ప్రేమకథను చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ కథ ఏమిటంటే....

ఎన్నో కష్టాలు పడి:

ఎన్నో కష్టాలు పడి:

‘ఎక్కడో మారుమూల కొండ ప్రాంతాల్లో ఓ అమ్మాయి ఉండేది. ఆమెకు ధైర్యం చాలా ఎక్కువ. తను ఓ రోజు నడుచుకుంటూ వెళ్తుంటే ఓ వ్యక్తి ఫోటో దొరికింది. ఆ వ్యక్తి నచ్చి ప్రేమలో పడిపోయింది. సముద్రాలు, కొండలు దాటి ఎగురుకుంటూ వచ్చేందుకు ఆమెకు ఆ ఫోటో స్ఫూర్తినిచ్చింది. ఎన్నో కష్టాలు పడి గుర్తింపు తెచ్చుకుని ఓ సందర్భంలో అతణ్ని కలిసింది.

ఐ లవ్యూ:

ఐ లవ్యూ:

ఆమెను అతడు దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుని ‘ఐ లవ్యూ' అన్నాడు. దాంతో ఆమె ప్రపంచాన్నే జయించినట్టు భావించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ యువతి సాధరణమైంది కాదని ఆ వ్యక్తి గుర్తించాడు. ఆమె కడుపులో సింహం ఉందని గుర్తించాడు. అతనికి భయం మొదలైంది.

నా నుంచి దూరంగా పారిపో:

నా నుంచి దూరంగా పారిపో:

దాంతో ఆమెకు దూరమైపోయాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆమె జీవితంలో అదే అతిపెద్ద విషాదం. అయినా ఆమె తన కడుపులో ఉన్న సింహాన్ని చంపుకోలేదు' అని కథ ముగించింది కంగన. తను ఎప్పుడూ తన తండ్రి కంటే గొప్పగా ఉండాలని కోరుకుంటానని, భర్త కంటే ఎక్కువ సంపాదించాలని అనుకుంటానని, ‘నీకు అది భయం కలిగిస్తే.. నా నుంచి దూరంగా పారిపో' అని చెప్పింది.

 ప్రేమలేఖలు :

ప్రేమలేఖలు :

తను రాసిన ప్రేమలేఖలు బయటపెట్టినపుడు, తనను ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టినట్టు భావించానని, చాలా రాత్రుళ్లు నిద్రలేకుండా గడిపానని చెప్పుకొచ్చింది. గత జనవరిలో హృతిక్ ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' (బోయ్‌ఫ్రెండ్‌) అనడంతో వివాదం మొదలైంది.

లీగల్ నోటీసులు:

లీగల్ నోటీసులు:

ఈ వ్యవహారంపై అప్పట్లో గుర్రుగా స్పందించిన హృతిక్ తర్వాత ఏకంగా కంగనాకు లీగల్ నోటీసులు పంపాడు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. దీనికి దీటుగా కంగనా కూడా లీగల్ నోటీసులతో బదులిచ్చింది.

నోటీసుల్లోని కంటెంట్‌ :

నోటీసుల్లోని కంటెంట్‌ :

ఈ లీగల్‌ నోటీసుల్లోని కంటెంట్‌ మాత్రం ఈ ఇద్దరి మధ్య పెద్ద గూడుపుఠాణి జరిగినట్టు వెల్లడిస్తోంది. కంగనా తనకు రోజుకు 50కిపైగా ఈమెయిల్స్‌ పంపి.. తనను వెంటాడిందని, ఆమె మొత్తంగా 1,439 ఈమెయిల్స్ పంపిందని తన లీగల్ నోటీసులలో హృత్తిక్ తెలిపాడు. సామాజికంగా సరిగ్గా వ్యవహరించలేని అస్పర్జెర్ అనే మానసిక రుగ్మతతో ఆమె బాధపడుతున్నదని, అందుకే ఈమెయిల్స్‌కు తాను ఎప్పుడూ సమాధానమివ్వలేదని అతను పేర్కొన్నాడు.

 సీక్రెట్ ఈమెయిల్ ఐడీతో:

సీక్రెట్ ఈమెయిల్ ఐడీతో:

కంగనా కూడా తన లీగల్ నోటీసులలో దీటుగా సమాధానమిచ్చింది. ఒక సీక్రెట్ ఈమెయిల్ ఐడీతో హృతిక్ తనతో సంభాషణ కొనసాగించాడని, మెయిల్స్ కూడా పంపాడని పేర్కొంది. అయితే హృతిక్ మాత్రం తన పేరిట ఎవరో నకిలీ ఐడీతో ఆమెకు మెయిల్స్ పంపించడంతో తాను ఒరిజినల్ ఐడీని ఆమెకు ఇచ్చానని,

కంగనాతో మాట్లాడలేదని:

కంగనాతో మాట్లాడలేదని:

అంతేకానీ కంగనాతో తాను మాట్లాడలేదని హృతిక్ అన్నాడు. .కంగనా మాత్రం తన అకౌంట్‌ను హృత్తిక్ హ్యాక్ చేసి.. అతడు విడాకుల వ్యవహారానికి ఇబ్బంది కలుగకుండా ఆ మెయిల్స్‌ అన్ని డిలీట్ చేశాడని ఆరోపించింది. తాను ఆయనకు పంపిన ఈమెయిల్స్‌ బహిర్గత పరిస్తే

 పరువునష్టం దావా:

పరువునష్టం దావా:

అతడిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించింది. హృతిక్ తో సత్సంబంధాలు కొనసాగిన సమయంలో ఆ మెయిల్స్ పంపడం జరిగిందని, వాటిని అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది.

'కైట్', 'క్రిష్-3':

'కైట్', 'క్రిష్-3':

హృతిక్, కంగనా రెండు సినిమాలు 'కైట్', 'క్రిష్-3'లో కలిసి నటించారు. 'కైట్' సందర్భంగా వీరి మధ్య స్నేహం చిగురించగా.. 'క్రిష్-3' సమయంలో వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే వదంతులు వచ్చాయి. ఆ సమయంలోనే హృతిక్ భార్య సుసానే ఖాన్‌ విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. ఈ దంపతులు వీడిపోవడానికి కంగనానే కారణమని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి.

English summary
Kangana Ranaut graced the Reebok Fit to Fight Awards ceremony last night where in a conversation with Silvia Tallon, Sr. Marketing Director, Reebok - she came out with her Fit to Fight story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu