»   » నిర్మాత సురేశ్ వేధించాడు.. బ్యాంకాక్‌లో దారుణంగా.. హీరోయిన్ ఆరోపణలు.

నిర్మాత సురేశ్ వేధించాడు.. బ్యాంకాక్‌లో దారుణంగా.. హీరోయిన్ ఆరోపణలు.

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నిర్మాత వేధింపులపై మరో హీరోయిన్ గొంతు విప్పింది. తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చరచ్చ చేసింది. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమలో చోటుచేసుకొన్నది. రాజు కన్నడ మీడియం నిర్మాత కే సురేశ్‌పై కన్నడ అందాల తార అవంతిక శెట్టి ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తనను సినిమా నుంచి తొలగించారు. సినిమా పూర్తయినా తనకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆమె సోషల్ మీడియాకు ఎక్కింది.

సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత ఉందా?

సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత ఉందా?

నిర్మాత సురేశ్ చేతిలో జరిగిన మోసం గురించి అవంతిక శెట్టి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటనను పోస్ట్ చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలకు భద్రత ఉందా అనే ప్రశ్నించింది. పరిశ్రమలో పురుషుల అహంకారానికి బలయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరుగకూడదు అని పేర్కొన్నది.

నాపై మీడియాలో తప్పుగా..

నాపై మీడియాలో తప్పుగా..

అభూత కల్పన, అవాస్తవాలను రంగరించి ఓ వార్తను నిర్మాత సురేశ్ పత్రికలో రాయించారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఆ వార్త ఉండటం నాకు ఆందోళన కలిగించింది. ఆ వార్తలో నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నా గురించి చెడుగా చిత్రకరించారు. నా కెరీర్‌కు ముప్పు కలిగించేలా ఆయన వ్యవహరించాడు అని అవంతిక వెల్లడించింది.

బ్యాంకాక్ నుంచి అర్ధాంతరంగా..

తొలి షెడ్యూల్ నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. నా పెర్ఫార్మెన్స్ బాగాలేదనే కారణం చెప్పి నిర్మాత, దర్శకుడు వేధిస్తున్నారని అర్థమైంది. ఆయినా సహనంతో వ్యవహరించాను. పాత్ర పరిధి మేరకు మంచి నటనను ఇచ్చేందుకు కష్టపడ్డాను అని తెలిపారు. చిత్రం పూర్తయ్యే సమయంలో కొంత భాగాన్ని బ్యాంకాక్‌లో చిత్రీకరించాడు. అక్కడ నాతో చాలా దారుణంగా ప్రవర్తించారు. మీరు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి అని నిలదీయగా, నీ పద్దతి బాగాలేదని చెప్తూ అక్కడి నుంచి నన్ను ముంబై పంపించారు అని ఆమె ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.

రెమ్యునరేషన్ చెల్లించలేదు

రెమ్యునరేషన్ చెల్లించలేదు

ఇప్పటివరకు నాకు చెల్లించాల్సిన సంగం బకాయిలు ఇవ్వలేదు. ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. నాతో డబ్బింగ్ చెప్పించకుండానే సినిమాను రిలీజ్ చేయాలని చూశారు. డబ్బింగ్ తప్పనిసరిగా చెప్పాలనే ఒప్పందాన్ని ఉల్లంఘించారు. వారు చేసిన మోసంపై కర్ణాటక కోర్టులో పిటిషన్ వేశాను. ఫిలిం చాంబర్‌లో ఫిర్యాదు చేశాను అని అవంతిక మీడియాకు వెల్లడించారు.

కల్పన3 చిత్రంలో..

కల్పన3 చిత్రంలో..

అవంతికశెట్టి తాజాగా కల్పన3 అనే తెలుగు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఉపేంద్ర, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆర్ అనంత రాజు దర్శకత్వం వహించారు. సాయివెంకట్ సమర్పణలో భీమవరం టాకీస్ బ్యానర్‌పై ఉపేంద్ర, ప్రియమణి, తులసి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `కల్పన-3`. ఉదయ్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ కొనెజోటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

English summary
Kannada actor Avantika Shetty has accused producer K Suresh of harassing her on the sets of Raju Kannada Medium. She also said she was booted out of the project without any notice and hasn’t been paid her dues despite completing the film. The actor took to Facebook and Twitter to tell her ordeal. Asking “are women really safe in the film industry?’, Avantika revealed how she has become another ‘objectification’ by some men in the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X