»   » కన్నడ యువహీరో ఆకస్మిక మృతి.. ప్రియమణి ఎమోషనల్ ట్వీట్..

కన్నడ యువహీరో ఆకస్మిక మృతి.. ప్రియమణి ఎమోషనల్ ట్వీట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ యువ హీరో ధ్రువ్ శర్మ మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణానికి పలు అవయవాలు పనిచేయకపోవడం కారణమని వైద్యులు పేర్కొన్నారు. ధ్రువ్ శర్మ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ధ్రువ్ ఎలాంటి శారీరక రుగ్మతలతో బాధపడిన దాఖలాలు లేవని సన్నిహితులు వెల్లడించండం గమనార్హం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో అన్ని సినీ పరిశ్రమలతో ధ్రువ్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. సీసీఎల్‌లో కర్నాటక బుల్డోజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.

మూగ, చెవిటి నటుడు

మూగ, చెవిటి నటుడు

ధ్రువ్ శర్మ పుట్టకతో మూగ, చెవిటితో బాధపడుతున్నారు. నటుడిగా మంచి పేరును సంపాదించుకొన్నారు. మూగ, చెవిటి లోపాలు ఉన్నప్పటికీ.. ఆయన చక్కటి లిప్ సింకింగ్‌తో తెర మీద రాణించారు. ధ్రువ్ శర్మ మూగ, చెవిటి అంటే ఎవరూ నమ్మరు అని సినీ ప్రముఖులు చెప్పుకొంటారు.

Kannada Actor Dhruv Sharma No More | Filmibeat Kannada
కుప్పకూలిన యువ హీరో

కుప్పకూలిన యువ హీరో

శనివారం ఉదయం కుప్పకూలడంలో ఆయనను వెంటనే దవాఖానకు తరలించి చికిత్సను అందించారు. స్థానిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ధ్రువ్ ఆకస్మిక మృతి పట్ల ప్రియమణి, రితేష్ దేశ్‌ముఖ్, అఫ్తాబ్ శివదాని తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

స్నేహాంజలి చిత్రం ద్వారా..

స్నేహాంజలి చిత్రం ద్వారా..

ధ్రువ్ శర్మ స్నేహాంజలి చిత్రంతో 2007లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ చిత్రంలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. విమర్శకులు సైతం ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత నీనంద్రే ఇష్ట కనో, తిప్పాజీ సర్కిల్, బెంగళూరు 560023, లూటీ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

ప్రియమణి ఎమోషనల్ ట్వీట్

ప్రియమణి ఎమోషనల్ ట్వీట్

‘ధ్రువ్ శర్మ మృతిని నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ధ్రువ్ శర్మ నీవు లేని లోటు తీర్చలేనిది. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక' అని హీరోయిన్ ప్రియమణి ట్వీట్ చేశారు.

గుండె పగిలిపోయింది.. రితేష్

గుండె పగిలిపోయింది.. రితేష్

ధ్రువ్ శర్మ నీవు ఇక లేవన్న వార్తతో ఒక్కసారిగా గుండె పగిలింది. నా నోటి నుంచి మాటలు పెగలడం లేదు. నా సోదరుడిని కోల్పోయినంతగా బాధ కలుగుతున్నది. నీ మధురస్మృతులు వెంటాడుతుంటాయి. రిప్ అని బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశాడు.

సోదరుడిని కోల్పోయాను.. అఫ్తాబ్

సోదరుడిని కోల్పోయాను.. అఫ్తాబ్

నా ప్రియమిత్రుల్లో ఒకరైన ధ్రువ్ శర్మ మృతితో షాక్ తిన్నాను. నా సోదరుడిని కోల్పోయానన్న బాధలో ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నాను అని బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదసానీ పేర్కొన్నారు.

English summary
Dhruv Sharma, who was known for his excellent cricketing skills in Celebrity Cricket League, and an actor by passion, is no more. The actor who was seen in the 2007 Kannada movie, Snehanjali, passed away today morning, August 1, due to multiple organ failure. The actor was a player for Karnataka Bulldozers and was often praised by Kichcha Sudeep for his skills.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu