»   » భార్యకు విడాకులిస్తున్న‘ఈగ’ఫేం సుదీప్ (ఫోటోలు)

భార్యకు విడాకులిస్తున్న‘ఈగ’ఫేం సుదీప్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రం ఫేం కిచ్చ సుదీప్ దాంపత్య జీవితం విడాకులకు దారి తీసింది. సుదీప్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ప్రియా రాదకృష్ణన్ కు విడాకులు ఇవ్వడానికి సిద్దం అయ్యారు. సుదీప్, ప్రియా ఇద్దరూ కుటుంబ న్యాయాలయాన్ని ఆశ్రయించారు.

విడాకులు ఇవ్వాలని కోర్టుకు మనవి చేశారు. సెప్టెంబర్ 11వ తేది శుక్రవారం ప్రియా, సుదీప్ సోదరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్బంగా సుదీప్ మీడియాతో మాట్లాడారు. ఇది తన వ్యక్తిగత విషయమని, దాన్నిపెద్దది చెయ్యరాదని అన్నారు. అందరి కుటుంబాలలో సమస్యలు ఉంటాయని గుర్తు చేశారు.

తన వ్యక్తిత్వంలో, వృత్తిలో ఎలాంటి మార్పులు రాలేదని చెప్పారు. తన కుటుంబంలో మార్పులు వచ్చాయని, అన్ని త్వరలో సర్దుకుంటాయని అన్నారు. వ్యక్తి గత జీవితం గురించి అన్ని తాను ఇప్పుడు వివరించలేనని సుదీప్ చెప్పారు. అయితే ఈ విషయం తెలిసి సుదీప్ అభిమానులు చాల నిరాశకు గురైనారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

బెంగళూరు నగరంలోని దయానంద కాలేజ్ లో సరోవర్ కుటుంబానికి చెందిన సుదీప్, కేరళ నాయర్ కుటుంబానికి చెందిన ప్రియా రాదకృష్ణన్ విద్యాభ్యాసం చేశారు.

14 సంవత్సరాల దాంపత్య జీవితం

14 సంవత్సరాల దాంపత్య జీవితం

2001వ సంవత్సరంలో సుదీప్, ప్రియా ప్రేమ వివాహం చేసుకున్నారు. సుదీప్ దంపతులకు ఒక ముద్దుల కూతురు ఉంది.

కుమార్తె అప్పగింత

కుమార్తె అప్పగింత

కుమార్తెను భార్య ప్రియాకు అప్పగించడానికి సుదీప్ అంగీకరించారని తెలిసింది. కుమార్తె అంటే సుదీప్ కు ప్రాణం. ఆమె తల్లి దగ్గర ఉంటేనే మంచిదని సుదీప్ భావించాడని సమాచారం.

విడాకుల ఖరీదు

విడాకుల ఖరీదు

సుదీప్ తన భార్యకు విడాకులు ఇస్తు భరణంగా రూ. 19 కోట్లు ఇస్తున్నారని తెలిసింది. అయితే అధికారికంగా సుదీప్ కానీ, ఇటు ప్రియా కాని ఈ విషయంపై స్పందించలేదు.

భార్య కోసం ఒక కంపెనీ

భార్య కోసం ఒక కంపెనీ

మహిళలకు స్వయంగా బ్రతకగల శక్తి ఉందని సుదీప్ అనేక సార్లు అన్నారు. అదే విధంగా తన భార్య వ్యాపారం చెయ్యడానికి ‘360 స్టేజ్ ఈవెంట్ మేనేజ్ మెంట్' అనే కంపెనీ స్థాపించాడు.

బహుబాష నటుడు, దర్శకుడు

బహుబాష నటుడు, దర్శకుడు

కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో సుదీప్ నటించాడు. తెలుగులో ఈగ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రక్త చరిత్ర, బాహుబలి, తమిళంలో పులి తదితర చిత్రంలో నటించాడు.

అభిమానుల ఆందోళన

అభిమానుల ఆందోళన

సుదీప్ ను ఆయన అభిమానులు ముద్దుగా కిచ్చ అని పిలుచుకుంటారు. సుదీప్ నటుడే కాదు, దర్శకుడు, నిర్మాత.

పెద్దది చెయ్యొద్దు

పెద్దది చెయ్యొద్దు

తాను ఒక సెలబ్రిటిని అని, తనకు అభిమానులు ఉన్నారని, తన చిన్న కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, దయచేసి పెద్దది చెయ్యరాదని సుదీప్ ఒక టీవీ చానెల్ తో అన్నారు.

English summary
Actor Kiccha Sudeep has reacted to the media regarding his Divorce. Sudeep has decided to end his 14 years relationship with his wife Priya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu