twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీటీల పేరుతో మోసం చేసిన నటుడు

    By Srikanya
    |

    మైసూరు: కన్నడ రాకింగ్ స్టార్ గా పేరుపడిన నటుడు యశ్ చీటీల పేరుతో పలువురిని మోసగించారని వివాదం చెలరేగింది. వివరాల్లోకి వెళ్తే... పదేళ్ల క్రితం యశ్ మైసూరులో నివాసమున్న సమయంలో చిన్నపాటి దుకాణంతో పాటు చీటీలు కూడా నడుపుతుండేవారు. అప్పట్లో యశ్ పేరు న వీన్ కుమార్. తల్లి పుష్పవతి చీటీ వ్యవహారం చూసుకునేది. యశ్ మాత్రం ఇంటింటికి వెళ్లి చీటీ డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఇలా సేకరించిన నగదుతో గుట్టుచప్పుడు కాకుండా యశ్ బెంగళూరు చేరుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

    బాధితులు బెంగళూరులోని కత్రిగుప్పెలో నివాసముంటున్న యశ్ ఇంటికి వెళ్లి చీటీ నగదు అడిగితే తనకు తెలియదని తప్పించుకుంటున్నాడని బాధితులు సోమవారం మీడియా ఎదుట వాపోయారు. దాదారు రెండు లక్షలు వరకూ బాకీలు ఉన్నాయని వారుచ అంటున్నారు. వారంతా బెంగుళూరులో యశ్ ఇంటికి వెళ్ళి నిలదీస్తున్నారు. తమను ఇంతలా ముంచుతాడని భావించలేదని, రేపో మాపో వచ్చి తమ బాకీలు తీరుస్తాడని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నామని వారు చెప్తున్నారు.

    దీనిపై యశ్ వివరణ ఇస్తూ... కొందరు పరిశ్రమలోని వాళ్ళే తన ఇమేజ్ ని దెబ్బతీయటానికి ఈ కుట్ర పన్నారని అంటున్నాడు. ఎదుగుతున్న తనను దెబ్బ కొట్టాలని వారి తాపత్రయమని అన్నారు. కావాలని తమ ఊరి జనాల్ని రెచ్చ గొట్టి తీసుకువచ్చి తన ఇంటి పైకి వదిలారని అన్నారు. అలాగే వారు చెప్పేదంతా అబద్దమని, తాము ఎవరికీ డబ్బు ఎగ్గొట్టలేదని అన్నారు.

    తాము చీటీల వ్యాపారం చేసింది మాత్రం నిజమేనని,తమ స్ధలాలు అమ్మి మరీ జనం బాకీ తీర్చామని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా లేనిది ఇప్పుడు తన మీదకు రావటం ఏమిటని అన్నారు. అలాగే తాను ఎప్పటికీ మీడియాకు దగ్గరగానే ఉంటానని,ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా ఏ క్షణమైనా రావచ్చునని అన్నారు.

    English summary
    ‘Chit Fund’ cheating case is filed on actor Yash and his family members. In the home town Paduvarahalli of Yash a group of affected people came directly to media and alleged that their money amounts to lakhs have been cheated. The group from Paduvarahalli says Yash and family came to Bangalore and settled down. They yell at asking the money invested on shits. It is nearly Rs.2 lakhs plus pending for the people of Paduvarahalli in the monthly ‘Chit’ run by Yash and family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X