»   » హీరో హీరోయిన్ ప్రేమ వివాహం: ఇండస్ట్రీ అంతా మద్దతు... (ఫోటోస్)

హీరో హీరోయిన్ ప్రేమ వివాహం: ఇండస్ట్రీ అంతా మద్దతు... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడ సినీ పరిశ్రమ(శాండల్ ఉడ్‌) స్టార్స్ యశ్, రాధిక పండిత్ పెళ్లి వేడుక బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్‌గా జరిగింది. కన్నడ చిత్ర సీమలో హిట్ జోడా పేరు తెచ్చుకున్న ఈ జంట ఇపుడు నిజజీవితంలోనూ భార్యభర్తలుగా మారారు. శుక్రవారం మధ్యాహ్నం 12.35 గంటలకు వివాహం జరిగింది.

ఈ మధ్య కాలంలో కర్నాటకలో ఏ సినీ స్టార్ పెళ్లి వేడుక కూడా ఇంత గ్రాండ్ గా జరుగలేదు. ఆర్ట్ డైరెక్టర్ అరుణ్ సాగర్ నేతృత్వంలో భారీ సెట్స్ వేసారు. ఈ సెట్స్ గ్రాండ్ లుక్ తో కళ్యాణ వేదికకు సరికొత్త శోభను తెచ్చాయి.

యశ్-రాధిక పండిట్ వివాహానికి సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి

Kannada actors Yash and Radhika Pandit tie the knot

యశ్-రాధిక పండిత్ పెళ్లి వేడుకకు కన్నడ సినీలోకం మొత్తం తరలివచ్చింది. నవదంపతులను ఆశీర్వదించేందుకు ఆది చుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామిజీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

యశ్-రాధిక పండిత్ సినీ రంగంలోనే పరిచయం అయ్యారు. ఇద్దరి ఆలోచనలు, మనస్తత్వాలు దగ్గరగా ఉండటంతో అతికొద్దికాలంలోనే స్నేహితులయ్యారు. గత ఆరేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు.

English summary
View Photos of Yash And Radhika Pandit Wedding Photos which was held at Palace Grounds in Bangalore on Dec 09, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu