»   » రక్షిద్దామనుకుంటే వీధి కుక్కల దాడి, వర్మ హీరోయిన్‌కు తీవ్రగాయాలు

రక్షిద్దామనుకుంటే వీధి కుక్కల దాడి, వర్మ హీరోయిన్‌కు తీవ్రగాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : పెంపుడు కుక్కును రక్షించుకోబోయి, వీధి కుక్కల బారిన బడింది రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ హీరోయిన్ పారుల్ యాదవ్. ఈ కన్నడ సినీ హీరోయిన్‌ పారుల్‌ యాదవ్‌ ముంబయిలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Kannada actress Parul Yadav attacked by stray dogs

ముంబయి నగరంలోని జోగేశ్వర్‌రోడ్‌లో సోమవారం సాయంత్రం తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్‌ చేస్తుండగా అక్కడి వీధికుక్కలు పారుల్‌యాదవ్‌ పెంపుడు కుక్కపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి.

దీంతో పెంపుడు కుక్కను రక్షించే క్రమంలో పారుల్‌ యాదవ్‌ వీధికుక్కలను తరమడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో వీధికుక్కలు పారుల్‌పై దాడికి పాల్పడడంతో ఆమె తల, చేతులు, కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి. గమనించిన పారుల్‌ యాదవ్‌ చెల్లెలు శీతల్‌ పారుల్‌ స్థానికుల సహాయంతో కుక్కల బారి నుండి పారుల్‌ను రక్షించి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

English summary
Actress Parul Yadav of Pyarge Killing Veerappan fame was attacked by six stray dogs when she was walking her pet near her apartment on Jogeshwari Road in the suburbs of Mumbai. She was attacked when she was trying to save her pet from being attacked by the stray dogs. Shockingly, no one came to her rescue.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu