»   » కమల్ కి కాజల్ హ్యాండిచ్చింది..అందుకే ఆమె

కమల్ కి కాజల్ హ్యాండిచ్చింది..అందుకే ఆమె

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : కమల్‌హాసన్‌తో కలిసి నటించే అవకాశాన్ని కన్నడ హీరోయిన్ రమ్య దక్కించుకొందా? అవుననే అంటున్నాయి చెన్నై సినీ వర్గాలు. కమల్‌ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించబోతున్నారు. దీనికి లింగుస్వామి నిర్మాత. ఆగస్టులో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.


ఈ చిత్రంలో మొదట కాజల్ ని అనుకున్నారు. కానీ ఆమె చివర నిముషాల్లో డేట్స్ ఖాళీ లేవు అని హ్యాండ్ ఇవ్వటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రమ్య ఇంతకు ముందు తెలుగులో 'అభిమన్యు'లో నటించింది. కన్నడంలో విజయాలు సాధించింది. తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేసింది. ఇప్పుడు కమల్‌తో నటించబోతోంది. ఈ సినిమాలో మరో పాత్రకు లేఖా వాషింగ్టన్‌ను ఎంచుకొన్నట్లు తెలిసింది.

కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి 'ఉత్తమ విలన్' అనే టైటిల్ ఖరారు చేసారు. కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా దర్శకుడు లింగుస్వామి ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి ఉత్తమ విలన్ అనే పేరును పెట్టినట్లు తెలిసింది. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.

ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.

English summary

 Ramya may play female lead beside Kamal Hassan. Recently Kamal Hassan has signed a film under Lingusamy’s direction and there is a huge buzz stating Ramya as Kamal’s leading lady.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu